For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

దీర్ఘ కాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక ఉన్న వారైతే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు భ‌ద్ర‌త త‌క్కువ అంటే రిస్క్ ఎ

|

బ్యాంకు వ‌డ్డీరేట్లు త‌గ్గిపోతూ వస్తున్నాయి. ఎక్కువ ఆదాయం పొందాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? దీర్ఘ కాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక ఉన్న వారైతే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు భ‌ద్ర‌త త‌క్కువ అంటే రిస్క్ ఎక్కువ‌. అదే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు ప్ర‌భుత్వ హామీని క‌లిగి ఉంటాయి. ఇక్క‌డ అలాంటి 7 ర‌కాల ప‌థ‌కాల‌ను చూద్దాం.

పీపీఎఫ్‌

పీపీఎఫ్‌

వ‌డ్డీ రేట్ల విష‌యంలో బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పీపీఎఫ్ కాస్త ఉత్త‌మ‌మ‌నే చెప్పాలి. అంతే కాకుండా బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీకి ఒక ప‌రిమితి మించితే ప‌న్ను క‌ట్టాల్సి ఉండ‌గా పీపీఎఫ్ ప‌న్ను మిన‌హాయింపు క‌లిగి ఉంది. మ‌రో వైపు బ్యాంకులు 7.5 శాతం వ‌డ్డీ రేటును అందిస్తుండగా పీపీఎఫ్‌కు 8.1శాతం వ‌డ్డీ వ‌స్తోంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద పీపీఎఫ్ ప‌న్ను మిన‌హాయింపుకు అర్హ‌త క‌లిగి ఉంది. అన్ని బ్యాంకు డిపాజిట్ల‌కు ఈ సెక్ష‌న్ కింద ప‌న్ను మిన‌హాయింపు లేదు. గుర్తుంచుకోండి పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు.

సుక‌న్య స‌మృద్ది ఖాతాలు

సుక‌న్య స‌మృద్ది ఖాతాలు

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ప‌క్క‌న పెడితే ఏ ఇత‌ర పెట్టుబ‌డి ప‌థ‌కంలో 8.6 వ‌డ్డీ రావ‌ట్లేదు. కాబ‌ట్టి మీకు అమ్మాయి ఉంటే ఈ ప‌థ‌కం గురించి ఆలోచించ‌డం మంచిది. వ‌చ్చే రాబ‌డికి ప‌న్ను ఉండ‌దు, సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు క‌లిగి ఉంది. మీకు అమ్మాయి(లు) ఉంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌కుండా ఉండేందుకు ఒక్క కార‌ణం దొర‌క‌దు.

 జాతీయ పొదుపు ప‌త్రాలు(నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్లు)

జాతీయ పొదుపు ప‌త్రాలు(నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్లు)

ఇత‌ర పోస్టాఫీసు ప‌థ‌కాల్లాగే జాతీయ పొదుపు పత్రాలు బ్యాంకుల కంటే ఎక్కువ వ‌డ్డీని అందిస్తున్నాయి. ప్ర‌స్తుతం 8.1 శాతం వ‌డ్డీ రేటు అంటే బ్యాంకుల కంటే క‌నీసం 0.5% శాతం అద‌న‌పు వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. ఇంతే కాకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు అద‌నం.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా 8.6 శాతం వ‌డ్డీ వ‌స్తోంది. ఇది మారుతూ ఉంటుంది. ఈ ప‌థ‌కం కూడా 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉంది. ఈ పెట్టుబ‌డి కాల‌ప‌రిమితి 5 ఏళ్లు. ఈ ఖాతాను ఒక పోస్టాఫీసు, బ్యాంకు నుంచి మ‌రోచోట‌కి మార్చుకునే స‌దుపాయం ఉంది. వ‌డ్డీ సంవ‌త్స‌రానికి 10 వేల‌ను మించితే టీడీఎస్ క‌ట్ చేస్తారు.

 నెలవారీ ఆదాయ ప‌థ‌కాలు

నెలవారీ ఆదాయ ప‌థ‌కాలు

మ‌ళ్లీ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు కూడా బ్యాంకు డిపాజిట్ల కంటే మంచి వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తాయి. నెల‌వారీ బ్యాంకు డిపాజిట్ల‌పై మీకు వ‌చ్చే వ‌డ్డీ 7-7.3 మ‌ధ్య ఉంటుంది. నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాల్లో వ‌చ్చే వ‌డ్డీ 7.8 శాతంగా ఉంది.

కిసాన్ వికాస్ ప‌త్ర

కిసాన్ వికాస్ ప‌త్ర

కిసాన్ వికాస్ ప‌త్ర ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు 110నెల‌ల్లో (9 ఏళ్ల 2 నెల‌లు) రెట్టింపు అవుతాయి. ఇందులో 100 మొత్తాల్లో ఎంతైనా పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఈ సర్టిఫికెట్ల‌ను కొనుగోలు చేసేందుకు గ‌రిష్ట ప‌రిమితి లేదు.

అయితే ఇందులో ఉన్న ప్ర‌తికూలాంశాలు దీని వ‌డ్డీ ద్వారా వ‌చ్చే ఆదాయానికి ప‌న్ను మిన‌హాయింపు లేక‌పోగా 80సీ కింద సైతం ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌ట్లేదు. అందుకే మేము దీనికి మేము సూచించ‌ము. పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల్లో చివ‌రి ఆప్ష‌న్‌గా దీన్ని ఎంచుకోవ‌డం ఉత్త‌మం.

 పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు ఏప్రిల్ 1,2016 నుంచి 7.4 శాతం వ‌డ్డీ వ‌స్తోంది. ఇది మూడు నెల‌ల‌కు ఒక‌సారి కాంపౌండ్ అవుతుంది. ఏడాది త‌ర్వాతి నుంచి విత్‌డ్రాయ‌ల్స్‌కు అనుమ‌తిస్తారు. క‌నీసం రూ. 10 నిల్వ‌తో పోస్టాఫీసు ఆర్‌డీని ప్రారంభించ‌వ‌చ్చు. ఖాతాను చెక్కు, న‌గదు రూపంలో తెరిచేందుకు వీలుంది. నామినేష‌న్ ఎంచుకునే సౌక‌ర్యం ఖాతా తెరిచేట‌ప్పుడు, తెరిచిన త‌ర్వాత సైతం ఉటుంది. ఖాతాను మైన‌ర్ పేరిట తెరవొచ్చు.

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి?

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి? మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి?

 ఇంట్లో కూర్చొనే పెద్ద‌గా పెట్టుబ‌డి లేకుండా ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బు సంపాదించుట‌కు 10 ఉత్త‌మ మార్గాలు

ఇంట్లో కూర్చొనే పెద్ద‌గా పెట్టుబ‌డి లేకుండా ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బు సంపాదించుట‌కు 10 ఉత్త‌మ మార్గాలు

ఇంట‌ర్నెట్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా? :10 ఉత్త‌మ మార్గాలు ఇంట‌ర్నెట్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం ఎలా? :10 ఉత్త‌మ మార్గాలు

English summary

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు | 7 small saving schemes for investors

The only way you can beat bank interest rates and earn better interest is by investing in small saving schemes or company fixed deposits. However, company fixed deposits are not safe, while small saving schemes are backed by the government. Here are 6 small saving schemes that you should own.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X