For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల‌కు, బ్యాంకు డిపాజిట్ల‌కు రాబ‌డుల్లో తేడా ఎలా?

15 నుంచి 20 ఏళ్ల కాల‌ప‌రిమితిని దృష్టిలో పెట్టుకుంటే రియ‌ల్ ఎస్టేట్‌, బంగారానికి ఏ మాత్రం మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టుబ‌డులు తీసిపోవు. అయితే ఈ మార్గంలో ఎలా ముందుకెళ్లాలో తెలియ‌క చాలా మంది వెనుక‌డుగు వేస్

|

సంప్రదాయ పొదుపు పథకాలు అంటే మొదటగా గుర్తొచ్చేవి ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు. పెద్దగా వడ్డీ లెక్కలు తెలియకపోయినా పొదుపు చేయాలనే ఆలోచన ఉన్నవారికి ఇవి బాగా పరిచయమైనవే. ఎప్పుడూ ఇవేనా, పెద్దగా రాబ‌డులు లేవ‌నే బాధ ఉంటుంది కానీ రిస్క్ ఎందుక‌నే ఊరుకుంటారు. అయితే స్టాక్‌మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టాలంటే రిస్క్ కానీ మ‌ధ్య కాలం నుంచి దీర్ఘ‌కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టేందుకు పెద్ద‌గా రిస్క్ తీసుకోన‌క్క‌ర్లేదు. 15 నుంచి 20 ఏళ్ల కాల‌ప‌రిమితిని దృష్టిలో పెట్టుకుంటే రియ‌ల్ ఎస్టేట్‌, బంగారానికి ఏ మాత్రం మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టుబ‌డులు తీసిపోవు. అయితే ఈ మార్గంలో ఎలా ముందుకెళ్లాలో తెలియ‌క చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. వారి కోస‌మే సిప్ మార్గం ఉన్న‌ది. దాని గురించి మరింత వివ‌రంగా తెలుసుకుందాం.

ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటి?

ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటి?

ఇంచుమించు ఈ పథకాలను పోలిన మరో పొదుపు పథకమే 'సిప్‌'. ఇటీవల కాలంలో సిప్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అన్నివర్గాల్లోనూ పెరుగుతుంది. రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ పథకాలకు సమాంతరంగా 'సిప్‌' పథకాలూ ఈ మ‌ధ్య ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే సిప్‌లలో పెట్టుబడి పెట్టడం, అందుకుతగ్గ లాభాలు పొందడం అంత సులువేం కాదు. వాటిపై సరైన అవగాహన ఉండాలి. అప్పుడే సిప్‌లతో లాభసాటి అంటున్నారు ఆర్థిక నిపుణులు. అసలు 'సిప్‌' పథకాలంటే ఏమిటి? వాటిని ఎలా ప్రారంభించాలి? అనేది ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సిప్ వ‌ర్సెస్ పొదుపు ప‌థ‌కాలు

సిప్ వ‌ర్సెస్ పొదుపు ప‌థ‌కాలు

అంద‌రి నోళ్ల‌లో నానే పొదుపు పథకాల్లో మాత్రమే ఎక్కువమంది పెట్టుబడి పెడుతుంటారు. కొత్తగా వచ్చే పథకాలు, షేర్‌ ఆధారిత డిపాజిట్స్‌ వంటి వాటివైపు మొగ్గుచూపాలంటే కొంతమంది భయపడతారు. కానీ, సంప్రదాయ పథకాల్లో వచ్చే వడ్డీ కంటే కాస్తంత మెరుగ్గా, పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడులూ వేగవంతం కావాలనే ఆలోచన చేసేవారికి సిప్ ప‌థ‌కాలే ఒక రకంగా అనుకూల‌మైన‌వి. అయితే అందుకు తగ్గ అవగాహన కావాలి. ఒకవేళ నష్టం వచ్చినా భరించగలిగే శక్తి ఉండాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ అంటే ఏమిటి?

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ అంటే ఏమిటి?

సిప్‌ అంటే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(క్ర‌మానుగ‌త పొదుపు ప‌థ‌కం). వీటిని ప్రధానంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందిస్తాయి. సిప్‌ పథకాలన్నీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా అసోసియేషన్‌ (యాంఫి) నియంత్రణలో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిప్‌ పథకమంటే కొంత రిస్క్‌ ఉంటుంది. అలాగని పెట్టే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఏమీ ఉండదు. షేర్లు, బంగారం వంటి సాధనాల్లో ఈ సిప్‌ల ద్వారా ఫండ్‌ సంస్థలు ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి.

పెట్టుబడి ఎలా పెట్టాలి?

పెట్టుబడి ఎలా పెట్టాలి?

సిప్‌లలో కూడా నెలకి కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఆర్‌డీకి, వీటికీ ఉన్న తేడా ఏంటంటే.. సిప్‌లలో మనం నెల నెలా కట్టే డబ్బుకి సరిపడా.. ఫండ్‌ సంస్థలు యూనిట్లు కేటాయిస్తాయి. ఆయా ఫండ్స్‌ నికర అసెట్‌ విలువ (ఎన్‌ఏవీ-నెట్‌ ఎస్సెట్‌ వాల్యూ) ను బట్టి మనకు లభించే యూనిట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఆయా షేర్లు, బంగారం రేట్లలో హెచ్చుతగ్గులను బట్టి ఫండ్‌ నెట్‌ ఎస్సెట్‌ వాల్యూ సిప్‌ విధానంలో ఎన్‌ఏవీ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు, అలాగే ఎన్‌ఏవీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు చేతికి వస్తాయి. అయితే, సిప్‌లలో నిర్దిష్టంగా ఇంత రాబడి వస్తుందని ఉండదు. కొన్ని సందర్భాల్లో లాభాలు తగ్గనూ వచ్చు.

కాలపరిమితి

కాలపరిమితి

జాతీయ బ్యాంకులతో కొన్ని మ్యూచ్‌వల్‌ ఫండ్‌ కంపెనీల్లో సిప్‌ పథకాలు ప్రారంభించవచ్చు. రోజువారీ చెల్లింపులు మొదలుకొని, వారం వారీ, నెలవారీ, మూడునెలలు, ఏడాది, మూడేళ్ళు, ఐదేళ్ళు కాలపరిమితిన చెల్లింపులు ఉంటాయి. సిప్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బును ప్రధానంగా ఆయా కంపెనీలు షేర్‌ మార్కెట్‌, బంగారం కొనుగోలు వంటి ఇతర లాభసాటి రంగాల్లో యూనిట్లుగా పెట్టుబడి పెట్టడం, కారణంగా వాటిపై వచ్చే రాబడి ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్స్‌ కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ సేవింగ్స్‌ కంటే ఎక్కువ అంటే సాలీనా తొమ్మిది శాతం కంటే 12 నుంచి 15 శాతం వరకూ గ్యారంటీగా లాభాలు రావొచ్చు. ఒక్కొక్కసారి ఇంతకంటే ఊహించని లాభాలు పెరగొచ్చు. అలాగే షేర్‌మార్కెట్‌, బంగారం, డాలర్‌ ధరలు పడిపోతే, కనీస రాబడి ఉండక పోవచ్చు. అందుకు సిద్ధపడాలి. యూనిట్లు మెరుగ్గా ఉన్నప్పుడు లాభసాటిగా అమ్ముకోవచ్చు. అంతే కానీ మార్కెట్ న‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అయ్యో యూనిట్ విలువ త‌గ్గుతుంద‌ని కంగారుప‌డి సిప్ పెట్టుబ‌డుల‌ను అమ్మ‌కూడ‌దు.

Read more about: mutual funds investments
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల‌కు, బ్యాంకు డిపాజిట్ల‌కు రాబ‌డుల్లో తేడా ఎలా? | try for mutual funds instead of regular bank deposits to get more returns

Bank Deposits are one of the safest avenues for savers in India with an almost negligible chance of default (although there have been instances of co-operative and local banks defaulting). As with all mutual funds, there are no guarantees in debt funds. Returns are market-linked and the investor is fully exposed to defaults or any other credit problems in the entities whose bonds are being invested in.
Story first published: Sunday, November 5, 2017, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X