Regular vs Direct Funds: స్టాక్‌మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. సొంతగా రిస్క్ చేయడం ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. పెట్టుబడిదారులకు బదులు ఫండ్ మేనేజర్ వారి ఇన్వెస్ట్‌మెంట్‌ను తక్కువ రిస్క్ కలిగి ఉండే సాధనాల్లో పెట్టి అధిక రిటర్న్స్ జనరేట్ చేస్తుంటారు. అయితే వీటిని ఎంచుకునే క్రమంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ప్రతి మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ మరియు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అనే రెండు వెర్షన్లలో ఉంటుంది. రెగ్యులర్ ఫండ్స్ (MF)కి డిస్ట్రిబ్యూషన్ కమీషన్ ఉంటుంది. అయితే డైరెక్ట్ ఫండ్స్ విషయంలో ఇది ఉండదు. ఈ రెండు రకాల ఫండ్స్ మధ్య వ్యయ నిష్పత్తి భిన్నంగా ఉంటుంది. అంటే నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులకు (AUM) వర్తించే మొత్తం ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. రెగ్యులర్ కంటే డైరెక్ట ఫండ్స్ ద్వారా మెరుగైన రిటర్న్స్ పొందడానికి ఇదొక కారణం.

రెగ్యులర్ విధానంలో ఇన్వెస్ట్ చేసే వారు మ్యూచువల్ ఫండ్ సలహాదారు లేదా ఇతర ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకుంటారు. దానివల్ల వారికి చెల్లించాల్సిన కమీషన్ పెట్టుబడి నుంచి తీసివేయబడుతుంది. కానీ డైరెక్ట్ ఫండ్స్ విషయంలో పెట్టుబడిదారుడే సొంత నిర్ణయంతో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఫీజులు లేదా పంపిణీ ఛార్జీల ప్రసక్తే ఉండదు. అందువల్ల ఖర్చు నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది.
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) అదే ఫండ్ రెగ్యులర్ వెర్షన్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుందని గమనించవచ్చు. పెట్టుబడిదార్లను తప్పుదారి పట్టించే అవకాశాలు కూడా చాలా తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి సహాయపడుతుందని భావించి ఓ సలహాదారుని సంప్రదించినా వారు పాక్షికంగా మాత్రమే సరైనవారు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పెట్టుబడిదార్లను మోసగించి లక్షలాది మందిని దోచుకున్న వెల్త్ అడ్వైజరీ ఏజెంట్లపై అనేక ఫిర్యాదులు నమోదై ఉన్నాయి.
ఇన్వెస్టర్లు డైరెక్ట్ ఫండ్స్‌ను ఎంచుకుంటే తమ పెట్టుబడులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. అంటే తమ నిధుల గురించి అధ్యయనం చేయడానికి సొంకగా పరిశోధించి, ఆర్థిక పరమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. ఈ తరహా చిన్న ప్రయత్నం కూడా పెట్టుబడుల విషయంలో చాలా దూరం తీసుకువెళ్లవచ్చు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications