మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి క్రమంగా పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలలోకి మొత్తం ఇన్‌ఫ్లో రూ.1.84 లక్షల కోట్లకు చేరుకుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) ద్వారా అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలకు మొత్తం ఇన్‌ఫ్లో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1.56 లక్షల కోట్ల కంటే 28 శాతం ఎక్కువ.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం డెట్ మ్యూచువల్ ఫండ్‌లు రూ.23,098 కోట్ల మేర పెరిగాయి. అదే సమయంలో, 2024 ఆర్థిక సంవత్సరంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లకు ఇన్‌ఫ్లో రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది.2024 ఆర్థిక సంవత్సరంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లకు ఇన్‌ఫ్లోలు ఊపందుకున్నాయి.

ఏప్రిల్ 2023లో రూ.13,700 కోట్ల నుంచి మార్చి 2024లో రూ.19,271 కోట్లకు పెరిగింది. ఇది ఒక ఆర్థిక వ్యవస్థలో 40 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. గత సంవత్సరం మ్యూచువల్ ఫండ్‌లలోకి సిప్ సహకారం ఏప్రిల్, జూన్‌లను మినహాయించి ప్రతి నెలా పెరుగుతూ వస్తోంది. పెట్టుబడిదారులు ఏప్రిల్‌లో సిప్ ద్వారా రూ.13,728 కోట్లను పెట్టుబడి పెట్టారు. ఇది జూలైలో రూ.15,245 కోట్లకు పెరిగింది.
సిప్ ద్వారా నవంబర్‌లో రూ.17,073 కోట్లు, జనవరిలో రూ.18,838 కోట్లు, మార్చిలో రూ.19,271 కోట్లకు పెరిగింది. తద్వారా వార్షిక సహకారం రూ.1,99,219 కోట్లకు చేరుకుంది. ఇదిలావుండగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం నికర ఆస్తులు (AUM) మార్చి 2024 చివరి నాటికి 2 శాతం క్షీణించి రూ.53,40,194 కోట్లకు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రూ.54.54 లక్షల కోట్లు టున్నట్లు AMFI డేటా వెల్లడించింది.


Click it and Unblock the Notifications