Mutual Funds: బంపర్ లాభాలిచ్చిన ఫండ్.. రూ.10,000 SIP రూ.78.32 లక్షలైంది..
MF Investments: స్టాక్ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన లేని వారు లేదా ఈక్విటీ మార్కెట్లంటే భయపడేవారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మెుగ్గుచూపుతున్నారు. మార్కెట్ల ర్యాలీతో బంపర్ లాభాలను అందించిన ఒక ఫండ్ పెట్టుబడిదారుల తలరాతను మార్చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫండ్ గురించే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ మే 2008లో ప్రారంభమైనప్పుడు అందులో ఎవరైనా ఇన్వెస్టర్ రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ మార్చి 2024 నాటికి రూ.9.6 లక్షలకు పెరిగి ఉండేది. అంటే ఇన్వెస్టర్లు దాదాపు 9 రెట్ల కంటే ఎక్కువ రాబడిని ఈ కాలంలో అందుకున్నారు. 2009 నుంచి ఫండ్ వార్షికంగా 15.33 శాతం కాంపౌండెడ్ రిటర్న్ అందించింది.

అలాగే ఈ ఫండ్‌లో ప్రతి నెల SIP రూపంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఊహించని రాబడులను అందుకున్నారు. ఎవరైనా ఇన్వెస్టర్ ఫండ్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచి 16 ఏళ్లుగా నెలవారీగా రూ.10,000 SIP చేసి ఉంటే వారు మెుత్తంగా రూ.19 లక్షలు పెట్టుబడిగా పెట్టేవారు. ఈ ఎస్ఐపీ పెట్టుబడి ప్రస్తుతం మార్కెట్ విలువ ఏకంగా రూ.78.32 లక్షలకు చేరుకుంది. ఈ కాలంలో 16.15% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఒక సంవత్సరంలో 42.23% రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ సూచీ కేవలం 34.97% మాత్రమే రాబడిని అందించింది.
బ్లూచిప్ కేటగిరీ కింద ఉన్న ఫండ్ ప్రధానంగా ఫైనాన్స్ సర్వీసెస్ (22%), క్రూడ్- గ్యాస్ అండ్ ఆయిల్ (12.92%), ఆటోమొబైల్ అండ్ ఆటో స్పేర్స్ (10.23%), IT (8.99%) రంగాల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఫండ్ పెట్టుబడి ప్యాట్రన్ పరిశీలిస్తే కంపెనీ ప్రధానంగా పెద్ద కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పోర్ట్ ఫోలియోకు స్థిరమైన రాబడులను అందించేందుకు వీలు కల్పించిందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications