Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్.. సాధారణ రుణాలతో పోలిస్తే భిన్నం.. ఇవీ వివరాలు
Loans for Mutual funds: రోజువారీ జీవితంలో పలు ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకుంటూ ఉంటాం. హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి ప్రత్యేక కారణాలతో తీసుకునేవి కొన్ని కాగా.. పర్సనల్ లోన్ వంటి ఇతర విభాగాలూ ఉన్నాయి. వీటికి అదనంగా బంగారం, భూమిని తనఖా పెట్టుకుని కూడా ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. మరి మ్యుచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవచ్చని తెలుసా..?
కొన్ని ఆర్థిక సంస్థలు మ్యూచువల్ ఫండ్‌లపై రుణాన్ని అందిస్తున్నాయి. దీంతో రుణగ్రహీతలు తమ పెట్టుబడులను లిక్విడేట్ చేయకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుత విలువ, పెట్టుబడి వ్యవధిని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని మంజూరు చేస్తారు. ఇతర లోన్లతో పోలిస్తే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు తిరిగి చెల్లింపుకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.

మ్యూచువల్ ఫండ్‌పై రుణాలు (LAMF) జనాదరణ పొందడంతో శీఘ్ర మరియు సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్‌ను కోరుకునే వ్యక్తులు ఎక్కువయ్యారు. పెట్టుబడులను విక్రయించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పద్ధతిపై ఆధారపడుతున్నారు. దీర్ఘ కాలిక లక్ష్యాలను స్వల్పకాలిక అవసరాల కోసం త్యాగం చేయకుండా ఆర్థిక
FinEzzy వ్యవస్థాపకులు అతుల్ గార్గ్ ప్రకారం.. హోల్డింగ్‌లలోని మొత్తం, కలిగి ఉన్న నిధుల రకంపై రుణాల పరిమితి ఆధారపడి ఉంటుంది. 'సాధారణంగా లోన్-టు-వాల్యూ (LTV) 50 శాతం నుంచి 95 శాతం మధ్య ఉంటుంది. ఇది డెట్ ఫండ్‌లకు ఎక్కువ కాగా ఈక్విటీలకు తక్కువ. కనిష్ట మరియు గరిష్ట మొత్తం 2 వేలు మరియు 25 లక్షలు. అయితే ఆయా ప్లాట్‌ఫారమ్‌ని బట్టి ఇది మారవచ్చు' అని గార్గ్ చెప్పారు. ఓ వ్యక్తి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 9.5 లక్షల రుణానికి అర్హుడన్నమాట.


Click it and Unblock the Notifications