Mutual funds: పెరుగుతున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేతన జీవులే ఖర్చులు తట్టుకోలేక వణికిపోతున్నారు. సంపాదన ఉన్న వారు ఎలాగొలా నెట్టుకొస్తున్నారు. కానీ రిటైర్‌మెంట్ వయసుకు దగ్గర పడిన వారిలో ఇదే విషయమై ఆందోళన నెలకొంది. ఈ తరహా పరిస్థితి నుంచి బయపడేందుకు, లక్షల్లో పెన్షన్ పొందే మార్గం ఒకటుంది.
సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP) అనేది ఓ మ్యూచువల్ ఫండ్స్ సాధనం. పదవీ విరమణ సమయంలో పెట్టుబడిదారులు ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని వారి మ్యూచువల్ ఫండ్ నుంచి క్రమం తప్పకుండా ఉపసంహరించుకోవడానికి ఇందులో అవకాశం లభిస్తుంది. వేతన జీవులతో సమానంగా నెలవారీ చెల్లింపులను అందిస్తూ ఆర్థిక పరిపుష్టిని సమకూరుస్తుంది.

పదవీ విరమణ తర్వాత 25 ఏళ్లపాటు నెలకు 1 లక్ష పెన్షన్ గా పొందింతే ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా జీవించవచ్చని నిపుణులు లెక్కలు కడుతున్నారు. SWP ద్వారా ఈ బెనిఫిట్ తో పాటు బోనస్‌గా అసలు పెట్టుబడి కూడా తిరిగి పొందవచ్చు. ఇవి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడిని అందిస్తాయి.
SWPలో నెలవారీ ఉపసంహరణ మొత్తం, ఫ్రీక్వెన్సీ మరియు వ్యవధిని కూడా ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. అంతేకాకుండా మిగిలిన కార్పస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇది పదవీ విరమణ పొందిన వారికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని గోల్స్ కోసం భారీ కార్పస్ సృష్టించాలంటే SIPను రికమండ్ చేస్తున్నారు.
పదవీ విరమణ తర్వాత 25 ఏళ్ల పాటు నెలకు 1 లక్ష పొందాలంటే 1.51 కోట్ల కార్పస్‌ను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 8 శాతం వార్షిక రాబడి చొప్పున లెక్కిస్తే అనుకున్న దాన్ని సాధించవచ్చు. పాతికేళ్లలో 4 కోట్ల 51 లక్షల రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దీనితో ప్రతినెలా 1 లక్ష పెన్షన్ పొందితే 3 కోట్లు అవుతుంది. ఇక మరో 1.51 కోట్లు అలాగే మిగిలి ఉంటాయి.


Click it and Unblock the Notifications