Mutual Funds: ఆ ఫండ్స్‌లో పెట్టుబడులపై సెబీ ఆంక్షలు.. వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇక నో ఛాన్స్

Sebi news: మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో నియంత్రణ సంస్థ సెబీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. లిక్విడేషన్ సహా పలు సమస్యల పరిష్కారానికి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ETFల గురించి ఆయా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విదేశీ ETFలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌పై నియంత్రణ సంస్థ సెబీ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిలోకి పెట్టుబడులు స్వీకరించడాన్ని నిలిపివేయాలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI)ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

SEBI directed Mutual Fund houses to stop investing in overseas ETFs

ఇతర దేశాల ఫండ్స్ మరియు స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పెట్టుబడి పరిమితి 7 బిలియన్ డాలర్లు. జనవరి 2022లో ఈ లిమిట్‌ను ఇండస్ట్రీ క్రాస్ చేసింది. ఇది ముగిసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాజా చర్యలకు సెబీ ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు విదేశీ ETFలలో పెట్టుబడి పరిమితి 1 బిలియన్ డాలర్లను కూడా దాటేయబోతుండటం గమనార్హం.

విదేశీ మార్కెట్లలో రెండు రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలు పెట్టుబడి పెడుతుంటాయి. వీటిలో మొదటిదానిలో నేరుగా విదేశాల్లో షేర్లను కొనుగోలు చేస్తాయి. వీటి పరిమితి 7 బిలియన్ డాలర్లు. ఇక రెండో విధానంలో 1 బిలియన్ డాలర్ల పరిమితి మేరకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ విదేశాల్లోని ETFల యూనిట్లను కొనుగోలు చేస్తుంటాయి. సెబీ తాజా నిర్ణయం ఈ రెండిటిపైనా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+