Minimum investment: ఆదాయంతో సంబంధం లేకుండా పెట్టుబడులు పెట్టి భారీ కార్పస్ సృష్టించే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్ కల్పిస్తున్నాయి. ప్రతినెలా SIP చేస్తూ పెద్దమొత్తంలో రిటర్న్స్ జనరేట్ చేయవచ్చు. ఈ తరహా సౌలభ్యాలు ఉండటంతో ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయంపై చాలా మందికి అపోహలు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడి అనేది ఆయా ఫండ్ రకం, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్, పెట్టుబడి విధానం సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. నెట్టింట వివిధ SIP కాలిక్యులేటర్స్ విరివిగా లభిస్తాయి. వాటితో ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్ మరియు రిటర్నులను లెక్కించి ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో వివిధ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాక్‌లు, బాండ్‌లు లేదా ఇతర సెక్యూరిటీలతో కూడిన విభిన్న పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు సాధారణంగా ఈక్విటీ ఫండ్స్‌లో 500 నుంచి 5 వేల వరకు కనీస పెట్టుబడిగా ఉంటుంది. ఇక డెట్ మరియు హైబ్రిడ్ ఫండ్స్‌లో ఈ మొత్తం దాదాపు వెయ్యి నుంచి ప్రారంభం అవుతుంది.
ప్రతినెలా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టే SIPలో అత్యంత తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణం ప్రారంభించవచ్చు. కనీసం 100తో కూడా పెట్టుబడి పెట్టేందుకు పలు ఫండ్స్ అవకాశం కల్పిస్తున్నాయి. అయితే తర్వాత కాలంలో ఆదాయానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే కాంపౌండింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇవి నేరుగా మార్కెట్‌తో లింక్ కాబడి ఉండటం వల్ల హెచ్చుతగ్గులు సహజం. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications