అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఈక్విటీ కేటగిరీలో ఇన్‌ఫ్లోలు గణనీయంగా పెరిగాయి. ఏఎంఎఫ్ఐ డేటా వెల్లడించిన ప్రకారం ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల ఇన్‌ఫ్లోలు వచ్చాయి. స్మాల్-క్యాప్ ఫండ్‌లు రూ.2,922.4 కోట్ల నికర ఇన్‌ఫ్లోతో ముందంజలో ఉన్నాయి.
తర్వాత రూ.1,808.2 కోట్లతో మిడ్-క్యాప్ ఫండ్‌లు ఉన్నాయి. రూ921.14 కోట్ల నికర ఇన్‌ఫ్లోలతో లార్జ్ క్యాప్ ఫండ్‌లు వెనుకబడి ఉన్నాయి. మార్చి 2021 నుంచి వరుసగా 36వ నెలలో ఈక్విటీ ఫండ్‌లలోకి ఇన్‌ఫ్లోలను భారీగా ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) ద్వారా పెట్టుబడులు జనవరిలో రూ.18,838 కోట్ల నుంచి రూ.19,186 కోట్ల కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.

ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్‌ల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (AUM) జనవరిలో రూ.52.74 లక్షల కోట్లతో పోలిస్తే రూ.54.54 లక్షల కోట్లకు పెరిగాయి. 3.42 శాతం పెరిగాయి. నెలలో సుమారుగా 20 ఓపెన్-ఎండ్ కొత్త ఫండ్ ఆఫర్‌లు (NFOలు) ప్రారంభించారు. మొత్తం రూ.11,469 కోట్లు సేకరించారు. అదనంగా రెండు క్లోజ్-ఎండ్ NFOలు ఫిబ్రవరిలో వచ్చాయి. వీటి ద్వారా రూ.251 కోట్ల నిధులను సేకరించారు.
సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లు ట్రాక్షన్‌ను కొనసాగుతోంది. నిర్వహణలో ఉన్న ఆస్తులలో 134% పెరుగుదల నమోదు అయింది. మరోవైపు ఓవర్‌నైట్ ఫండ్‌లు అత్యధికంగా రూ.17,375.61 కోట్ల అవుట్‌ఫ్లోను చవిచూశాయి. జనవరిలో రూ.995.07 కోట్ల ఇన్‌ఫ్లో రివర్స్ అయింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లోను చూసింది. నెలలో మొత్తం రూ.,808.82 కోట్లు ఇన్ ఫ్లోస్ వచ్చాయి.


Click it and Unblock the Notifications