Stress test results: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఆయా ఫండ్ హౌస్‌లు లిక్విడిటీ, అస్థిరత వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనిపై నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు) మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఈక్విటీ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్, లిక్విడిటీ, అస్థిరత, వాల్యుయేషన్ మరియు పోర్ట్‌ఫోలియో టర్నోవర్ ఫలితాలను ప్రతి 15 రోజులకు వెల్లడించాలని ఆదేశించింది.
తమ స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ పోర్ట్‌ఫోలియోలలో 50 శాతం మరియు 25 శాతాన్ని లిక్విడేట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిందిగా అన్ని ఫండ్ హౌస్‌లను సెబీ కోరింది. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి మార్కెట్ అస్థిరత, నష్టాలు మరియు ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది. లిక్విడిటీ మరియు పొదుపుల రీబ్యాలెన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ మళ్లింపు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం ఈ పరీక్షల లక్ష్యంగా పేర్కొంది.

కాగా మార్చి 31తో ముగిసిన నెల స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసిన మొదటి ఫండ్ హౌస్‌లలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. గతనెల పరీక్షలలో 50 శాతం పోర్ట్‌ఫోలియో లిక్విడేషన్‌కు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 22 రోజుల సమయం తీసుకుంది. కాగా ఏప్రిల్ 12న వెల్లడించిన ఫలితాలలో లిక్విడిటీ స్థానాన్ని 2 రోజులు మెరుగుపరుచుంది.
తాజా స్ట్రెస్ టెస్ట్ ఫలితాల ప్రకారం.. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 25 శాతం లిక్విడేట్ చేయడానికి 11 రోజులు పడుతుంది. లార్జ్‌క్యాప్ అల్లొకేషన్ 28.36 శాతం నుంచి 30.52 శాతానికి పెరగ్గా, నగదు కేటాయింపులు 5.53 శాతం నుంచి 4.28 శాతానికి తగ్గింది. మిడ్‌క్యాప్ విషయానికి వస్తే, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం లిక్విడేట్ చేయడానికి 7 రోజులు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ విభాగంలో గత ఫలితం కంటే ఒక రోజు పెరిగింది.
ఏప్రిల్ 12 వరకు ఫలితాలు వెల్లడించిన ఇతర ఫండ్ హౌస్‌లలో UTI మ్యూచువల్ ఫండ్ మరియు మహీంద్రా మాన్యులైఫ్ ఫండ్స్ ఉన్నాయి. 50 శాతం పోర్ట్‌ఫోలియో విక్రయానికి మహీంద్రా ఫండ్ 4 రోజులు తీసుకుంటుంది. అయితే 25 శాతం లిక్వేషన్‌కు కేవలం 2 రోజులు సరిపోతోంది.
ఇక UTI విషయానికి వస్తే స్మాల్ క్యాప్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం విక్రయానికి 5 రోజులు, 25 శాతం లిక్విడేషన్‌కు 3 రోజులు పడుతుంది.


Click it and Unblock the Notifications