కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ కాంగ్రెస్ భారీ చర్యలు చేపట్టింది. దీంతో గత వారం అమెరికా మార్కెట్లు కాస్త పుంజుకున్నప్పటికీ వారం చివరలో నష్టపోయాయి. గత కొద్ది రోజులుగా కరోనా కారణంగా అమెరికాలో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం మార్కెట్లపై ఈ వారం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా స్టాక్ మార్కెట్లు తెరిచేందుకే ట్రంప్
అమెరికాలో స్టాక్ మార్కెట్ల మూసివేత అంశంపై కూడా చర్చ జరిగింది. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఆందోళనలు కలిగిస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అమ్మకాలు భారీగా పెరుగుతున్నందున మార్కెట్లు క్లోజ్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, కామెంటేటర్స్ సూచించారు. తద్వారా ఇన్వెస్టర్లకు తాత్కాలిక ఊరటను ఇవ్వవచ్చునని తెలిపారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం మార్కెట్లు తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మధ్య నుండి ఎస్ అండ్ పీ 500 ఏకంగా 25 శాతం మేర పడిపోయింది. మార్చిలో ప్రతి ఇండెక్స్ దాదాపు ప్రతి రోజు 5.2 శాతం మేర పడిపోయింది.

నిఫ్టీ అంచనా
గత వారంలో భారత మార్కెట్లకు స్వల్ప ఊరట దక్కింది. కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా కరోనా మృతులు పెరుగుతుండటం, దేశంలోను కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మార్కెట్లపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. నిఫ్టీ గత వారం 1500 పాయింట్ల మేర రికవరీ సాధించింది. స్వల్పకాలిక అప్ ట్రెండ్ నిలబెట్టుకోవడానికి 8500 వద్ద క్లోజ్ కావాలని నిపుణులు చెబుతున్నారు. 8500 వద్ద విఫలమైతే మరింత డౌన్ ట్రెండ్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మద్దతు స్థాయి 8300 వద్ద నిలదొక్కుకోవాలని, అక్కడ కూడా విఫలమైతే ప్రమాదమేనని అంటున్నారు. మొత్తంగా ఈ వారం నిఫ్టీ 8160 నుండి 9300 మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు.

బంగారం, వెండి
పసిడి శుద్ధి కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేశారు. పెట్టుబడులు మాత్రం కొనసాగవచ్చు. బంగారం కాంట్రాక్టుకు రూ.44,800 నుండి రూ.45,540 మధ్య నిరోధం ఎదురుకావొచ్చునని, రూ.38,665 వద్ద స్టాఫ్‌లాస్‌గా పెట్టుకొని ట్రేడింగ్ చేయాలని అంటున్నారు. వెండి కూడా రూ.38,300 కిందకు వస్తే కిలో రూ.37,000కు పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

చమురు ధరలు..
అంతర్జాతీయస్థాయిలో చమురుకు డిమాండ్ తగ్గింది. మరోవైపు పోటీ నెలకొంది. దీంతో ఏప్రిల్ కాంట్రాక్టు బలహీనంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. రష్యా, సౌదీ మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం పెరగవచ్చునని భావిస్తున్నారు. సహజవాయువు పరిస్థితి ఇలాగే ఉంటుంది.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications