For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు

|

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకు ఉద్యోగులు, సాఫ్టువేర్ రంగ నిపుణులు.. ఇలా ఎన్నో రంగాల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కమోడిటీ ఎక్స్చేంజ్, ఎంసీఎక్స్ కూడా కొంతమందికి ఇంటి నుండి పనిచేసే వెసులుబాటు ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ నుండి పని చేస్తున్నారు.

అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!

50 మంది ఉద్యోగులు ఆఫీస్‌లోనే..

50 మంది ఉద్యోగులు ఆఫీస్‌లోనే..

కమోడిటీ ఎక్స్చేంజ్, ఎమ్‌సీఎక్స్ కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం చెల్లించనుంది. ఎమ్‌సీఎక్స్‌లో దేశవ్యాప్తంగా 400 మంది పని చేస్తున్నారు. ఒక్క ముంబైలోనే 300 ఉద్యోగులు ఉన్నారు. గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు ఎమ్‌సీఎక్స్ తెలిపింది.

రెట్టింపు, మూడు రెట్ల వేతనాలు

రెట్టింపు, మూడు రెట్ల వేతనాలు

ఆఫీస్‌లోనే ఉండి పని చేస్తున్న వారికి కావాల్సిన రోజువారీ అవసరాలను సమకూరుస్తున్నామని, ఎక్స్చేంజ్ భవనంలో బస సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎంసీఎక్స్ తెలిపింది. ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు వారికి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. కొంతమందికి మూడు రెట్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది.

1.5 రెట్ల నుండి 3 రెట్ల వేతనాలు

1.5 రెట్ల నుండి 3 రెట్ల వేతనాలు

కొవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు కార్యాలయంలోనే ఉండి పని చేస్తున్నారని, వారిలో ధైర్యాన్ని పెంచేందుకు, ప్రోత్సాహకం లేదా రివార్డ్ ఇచ్చేందుకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. ఉద్యోగులు వరుసగా వారం రోజులు పని చేసిన వారి నుండి మొదలు బ్రేక్ లేకుండా పని చేసే వారి వరకు వరుసగా 1.5 రెట్ల నుండి 3 రెట్ల వేతనాలు ఇస్తామని తెలిపింది.

English summary

కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు | Coronavirus: MCX offers up to 3x salary to those working from office

Largest commodities bourse MCX is offering up to 3x more salaries to select few employees, who are working from office in the city.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X