అంతర్జాతీయ విపణిలో భారత సత్తా చాటుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. దేశ అవసరాలకు అనుగుణగా వివిధ రకాల చట్టాలను అమలు చేస్తూ, అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో ప్రపంచంతో పోటీ పడటంలో వెనుకబడి ఉందని అర్థం అవుతుంది. వాటిలో ఒకటి మేథో సంపత్తి ఇంటెక్స్ నివేదిక సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

55 దేశాల్లో భారత్ స్థానం:
US ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ మేథో సంపత్తి(IP) నివేదికలో భారత్ 42వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో IP హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని 55 దేశాలతో ఈ నివేదికను సిద్ధం చేసింది. ప్రపంచ GDPలోదాదాపు 90 శాతానికి ఈ 55 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పేటెంట్, కాపీ రైట్ చట్టాల ద్వారా మేథో సంపత్తి హక్కులను సాధించుకునే విషయాన్ని సైతం పరిగణలోనికి తీసుకున్నారు.

భారత చర్యలు భేష్:
"ప్రపంచ వేదికపై భారత్ ప్రభాహం పెరుగుతున్నందున IP ఆవిష్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. ఇలా భావించే మార్కెట్లలో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే కాపీరైట్ కంటెంట్ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చింది. ఆన్లైన్ ట్రేడ్ మార్క్, ఉదారమైన R&D, IP ఆధారిత పన్ను ప్రోత్సాహకాలు తీసుకొచ్చింది. మేథో సంపత్తిపై అవగాహన, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తమ ఫ్రేమ్ వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. దీర్ఘకాలిక అంతరాలను పరిష్కరించేందుకు ప్రస్తుతమున్న విధానాల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది" అని US ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ కిల్ బ్రైడ్ అన్నారు.

వీటిలో భారత్ ఇప్పటికీ..
అయితే ఇప్పటికీ కొన్ని విషయాల్లో భారత్ బలహీనంగానే ఉన్నట్లు బ్రైడ్ పేర్కొన్నారు. IP అప్పిలేట్ బోర్డుని 2021లో రద్దు చేసినట్లు గుర్తు చేశారు. తక్కువ వనరులతో కూడిన న్యాయవ్యవస్థకు మేథో సంపత్తి హక్కుల అమలును అప్పగించడం అంత సబబు కాదని అభిప్రాయపడ్డారు. తద్వారా సంబంధిత వివాదాల్లో పరిష్కారానికి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బయో ఫార్మాస్యూటికల్స్ కోసం పరిమిత ఫ్రేమ్ వర్క్, అంతర్జాతీయ ప్రమాణాలకు దూరంగా ఉన్న పేటెంటబులిటీని ఇతర బలహీనతలుగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications