కెమెరా తెచ్చిన తంట.. లక్షలాది హోండా కార్లు రీకాల్ !!
Honda recall: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. USలో దాదాపు 1.2 మిలియన్ వాహనాలకు రీకాల్ నోటీసును జారీ చేసింది. వెనుక కెమెరా చిత్రించే వీడియో డాష్ బోర్డ్ స్క్రీన్‌పై కనిపించడంలో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
2018 నుండి 2023 వరకు విక్రయించబడిన కొన్ని ఒడిస్సీ మినీవ్యాన్‌లు, 2019-2022 మధ్యలోని పైలట్ SUVలు మరియు 2019-2023 లోపు పాస్‌పోర్ట్ SUVలు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం.. లోపభూయిష్ట కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని భావిస్తున్నట్లు హోండా వెల్లడించింది.

వెనుక వైపు కెమెరా వ్యూ ఇమేజ్ లేకపోవడం వల్ల డ్రైవర్ నోటీస్ చేసే స్థాయి దెబ్బతింటుందని US రెగ్యులేటర్ తెలిపింది. తద్వారా వాహనాన్ని ఢీకొట్టే అవకాశం పెరుగుతుందని పేర్కొంది. దాదాపు 2 లక్షల 74 వేల వారంటీ క్లెయిమ్‌లను హోండా అందుకుంది. అయితే ఈ ఉదంతాల్లో ఎవరికీ గాయాలు సంభవించకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.
కేబుల్ హార్నెస్‌ను మార్చడంతోపాటు ఎటువంటి ఖర్చు లేకుండా స్ట్రెయిటెనింగ్ కవర్‌ను సైతం ఆయా వాహనాలకు అమర్చనున్నట్లు హోండా పేర్కొంది. ఇందుకోసం జూలై 24 నుంచి ఆయా వాహనాల యజమానులకు లేఖ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. ఫోర్డ్ మోటార్ కూడా ఇంజిన్ ఫ్లూయిడ్ లీక్ దృష్ట్యా లక్షా 25 వేల వాహనాలను ఇటీవల రీకాల్ చేయగా.. ఇప్పుడు హోండా సైతం అదే బాటలో నడుస్తోంది.


Click it and Unblock the Notifications