For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SVB: దివాలా పిటిషన్ దాఖలు చేసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్..

|

అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) అధికారికంగా దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ దాని పెట్టుబడి బ్యాంక్, వెంచర్ క్యాపిటల్ వ్యాపారాన్ని కలిగి ఉన్న ఆస్తులను విక్రయించడానికి ఈ పిటిషన్ దాఖలు చేసిదింది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న తర్వాత SVB ఫైనాన్షియల్ గ్రూప్ ఇకపై సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో పనిచేయదు. SVB ఫైనాన్షియల్ గ్రూప్ సుమారు USD 2.2 బిలియన్ల లిక్విడిటీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక సంక్షోభం

ఆర్థిక సంక్షోభం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, 2008లో వాషింగ్టన్ మ్యూచువల్‌ ఫండ్ సంక్షోభం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంక్ వైఫల్యంగా పేర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ గా ఉంది. ఈ బ్యాంక్ ఎక్కువగా స్టార్ట్ ప్ లకు రుణాలు ఇస్తుంటుంది. ప్రస్తుతం అమెరికాలో దిగ్గజ బ్యాంక్ లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్న తరుణంలో దీనిని చాలా మంది 2008 లేమన్ బ్రదర్ ఘటనతో పోల్చుతున్నారు.

US వెంచర్ క్యాపిటల్

US వెంచర్ క్యాపిటల్

SVB సగం వ్యాపారం US వెంచర్ క్యాపిటల్-ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలతో ముడిపడి ఉందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. బ్యాంక్ వ్యాపారంలో 44 శాతం వరకు టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల కంపెనీలతో కలిసి నిర్వహిస్తోంది.

వడ్డీ రేట్ల పెంపు ఈ రంగాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కంపెనీలు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. మార్చి 8న తన పోర్ట్‌ఫోలియో నుండి $21 బిలియన్ల సెక్యూరిటీలను $1.8 బిలియన్ల నష్టానికి విక్రయించినట్లు SVB ప్రకటించింది.

41 శాతం

41 శాతం

బ్యాంక్ పతనంతో SVB షేర్లు 41 శాతం పడిపోయాయి. ఇది 1998 నుండి అతిపెద్ద క్షీణతగా ఉంది. "మార్చి 9వ తేదీకి ముందు బ్యాంక్ మంచి ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు, డిపాజిటర్లు $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా లిక్విడిటీ తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

భారతీయ అగ్రశ్రేణి ఐటి సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రాంతీయ బ్యాంకులకు సర్వీస్ లు అందిస్తున్నట్లు జెపి మోర్గాన్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు.

English summary

SVB: దివాలా పిటిషన్ దాఖలు చేసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. | US Silicon valley bank filed bankrupty officially

Silicon Valley Bank (SVB) has officially filed for bankruptcy. SVB Financial Group has filed the petition to sell assets comprising its investment bank and venture capital business.
Story first published: Saturday, March 18, 2023, 9:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X