For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Layoffs: అమెరికా, యూరప్‍లో ఏం జరుగుతుంది.. భారతీయ కంపెనీల్లో లే ఆఫ్‍లు తప్పవా..!

|

ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ ఐటీ సేవల రంగం రాణిస్తునే ఉంది. పైగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తొలగించలేదు. ఇటీవల అమెరికా, యూరప్‌లలో బ్యాంకుల పతనం భారత ఐటీ రంగాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అమెరికా, యూరప్

అమెరికా, యూరప్

భారతదేశ IT సేవా పరిశ్రమలో అధిక భాగం ఆదాయం, వ్యాపారం BFSI విభాగం నుంచి వచ్చినప్పటికీ, అమెరికా, యూరప్ వంటి అగ్రరాజ్యం దేశాలలో బ్యాంకులు దివాలా తీయడమే కాకుండా, పెద్ద బ్యాంకులు లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిలో భారతీయ ఐటీ సేవల పరిశ్రమలోని బీపీఎం అంటే ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగం ప్రస్తుతం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్యాకింగ్

బ్యాకింగ్

భారతీయ ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ $245 బిలియన్ల కాగా ఇందులో దాదాపు 41 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు అమెరికా, యూరప్‌లలో బ్యాంకుల పతనం భారతీయ ఐటీ రంగాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. US, యూరోప్‌లలో బ్యాంకుల పతనం కారణంగా భారతీయ IT BPM కంపెనీలు తమ ప్రస్తుత వ్యాపారాన్ని కోల్పోతాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో

భారతీయ IT BPM కంపెనీలు తాత్కాలికంగా మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ భారతీయ కంపెనీలపై ఈ ప్రభావం పడితే లేఆఫ్ లు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత ఐటీ బీపీఎం సెక్టార్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీలు యూఎస్ మార్కెట్‌లో మంచి వాటాను కలిగి ఉన్నాయి. అక్కడి బ్యాంకులు సమస్యలు ఎదుర్కొడం వల్ల ఈ కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

English summary

Layoffs: అమెరికా, యూరప్‍లో ఏం జరుగుతుంది.. భారతీయ కంపెనీల్లో లే ఆఫ్‍లు తప్పవా..! | there be lay offs in Indian IT companies, it possible

The world's leading companies are reducing their spending due to fears of economic recession. Employees are being fired as part of that.
Story first published: Tuesday, March 21, 2023, 17:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X