For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు.వివరాలు ఇలా ఉన్నాయి.

గృహ వంట గ్యాస్ సీలిండర్లపై(ఎల్పిజి)రూ. 1.46 రూపాయల ధర తగ్గింది ,ఇంధన ధరలపై పన్ను ప్రభావం కారణంగా ధరలు తగ్గాయి.గత రెండు నెలల్లో ఇది వరుసగా మూడవ తగ్గింపు.

By bharath
|

గృహ వంట గ్యాస్ సీలిండర్లపై(ఎల్పిజి)రూ. 1.46 రూపాయల ధర తగ్గింది ,ఇంధన ధరలపై పన్ను ప్రభావం కారణంగా ధరలు తగ్గాయి.గత రెండు నెలల్లో ఇది వరుసగా మూడవ తగ్గింపు. 14.2 కిలోల సబ్సిడీ కలిగిన ఎల్పిజి సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 494.99 రూపాయలు,తగ్గిన ధర గురువారం అర్ధరాత్రి నుంచి రూ. 493.53 రూపాయల అమల్లోకి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ ఒక ప్రకటనలో తెలిపింది.డిసెంబరు 1 న సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింపు రూ. 6.52 రూపాయలు మరియు రూ. జనవరి 1 న రూ.5.91 రూపాయల ధర తగ్గింపు జరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

నాన్ సబ్సిడైజ్డ్ లేదా ఎల్పిజి మార్కెట్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పిజి ధర తగ్గడం, డాలర్-రూపాయి మారకం రేటును పటిష్టం చేయడం వంటి కారణాల వల్ల సిలిండర్ పై రూ.30 రూపాయలు చొప్పున తగ్గింది అని ఐఒసి పేర్కొంది.

ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలెండర్కు రూ. 659 రూపాయలు ధర పలుకుతోంది.

ప్రతి సంవత్సరానికి

ప్రతి సంవత్సరానికి

సిలిండర్ ధరలు తగ్గింపు జనవరి 1 న రూ.120.50 రూపాయలు మరియు డిసెంబరు 1 న రూ. 133 రూపాయలు.ఎల్పిజి వినియోగదారులు మార్కెట్ ధర వద్ద ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.అయితే, వినియోగదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 14.2 కిలోల ప్రతి ఇంటికి 12 సిలిండర్లను సబ్సిడీ చేస్తుంది.

బెంచ్మార్క్ LPG రేటు

బెంచ్మార్క్ LPG రేటు

సగటు సరాసరి బెంచ్మార్క్ LPG రేటు మరియు విదేశీ మారకం రేటులో మార్పుల ఆధారంగా ఈ సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ రేట్లు పెరుగుతున్నప్పుడు, ప్రభుత్వం అధిక రాయితీని అందిస్తుంది మరియు ధరలు తగ్గినప్పుడు,సబ్సిడీ కట్ అవుతుంది.

పన్ను నిబంధనల ప్రకారం

పన్ను నిబంధనల ప్రకారం

పన్ను నిబంధనల ప్రకారం, ఎల్పిజిపై జీఎస్టీ ఇంధన మార్కెట్ రేటులో లెక్కించాల్సి ఉంది. ప్రభుత్వం ధరలో కొంత భాగాన్ని సబ్సిడీగా ఎంచుకోవచ్చు కానీ మార్కెట్ రేట్లు చెల్లించవలసి ఉంటుంది.

కావున,మార్కెట్ ధర లేదా నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి ధర తగ్గడంతో, సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ పై పన్ను సంభావ్యత కూడా తగ్గింది ఇది ధర తగ్గింపుకు దారితీసింది.

దేశీయ ఎల్పిజి వినియోగదారులు

దేశీయ ఎల్పిజి వినియోగదారులు

దేశీయ ఎల్పిజి వినియోగదారులు ముందస్తు నగదు చెల్లింపు వలన సిలిండర్కు రూ.30 రూపాయల వరకు తగ్గిపోతుంది.వారికి సిలిండర్ పై రూ.689 రూపాయల నుండి ముందస్తు చెల్లింపు కారణంగా రూ .659 రూపాయల ధరకే వస్తుంది అని IOC తెలిపింది.

సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు రూ. 165.47 రూపాయల సబ్సిడీని ఫిబ్రవరి నెలలో వారి బ్యాంకు ఖాతాలకు వస్తుంది.

Read more about: lpg
English summary

తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు.వివరాలు ఇలా ఉన్నాయి. | LPG Cylinder Gets Cheaper. Here's How Much You Pay Now

Domestic cooking gas (LPG) price was cut by Rs. 1.46 per cylinder Thursday, the third straight reduction in a month's time due to tax impact on reduced market rate of the fuel.
Story first published: Saturday, February 2, 2019, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X