LPG Price: శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి రూ.300 తగ్గుతున్న గ్యాస్ సిలిండర్ రేటు.. పూర్తి వివరాలు..
LPG Rate: ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు పెద్ద ఊరటను అందించే అంశం ఒకటి ఉంది. దేశంలోని కోట్లాది మంది గృహ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల ధరల తగ్గింపు ఊరటను అందించటానికి సిద్ధంగా ఉంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. వీటిలో ఒకటి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY)కి సంబంధించినది. వాస్తవానికి ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్ రూ.300 తగ్గింపును పొందడం కొనసాగుతుంది. ఈ సబ్సిడీ మినహాయింపు 31 మార్చి 2024తో ముగియాల్సి ఉండగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఉపశమనాన్ని 31 మార్చి 2025 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇది కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.

స్కీమ్ కింద లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్లు పొందేందుకు అర్హులు. దీని కింద 14.2 కిలోల ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందించబడుతుంది. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విధంగా ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే రూ.300 తక్కువ ధరకే సిలిండర్లు లభిస్తాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12,000 కోట్లుగా ఉంది.
గ్రామీణ వెనుకబడిన పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మే 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో మార్చి 1, 2024 వరకు 10.27 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. భారతదేశం తన LPG అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఉజ్వల యోజన లబ్ధిదారుల వినియోగదారుల సగటు LPG వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుంచి 2023-24కి (జనవరి 2024 నాటికి) 3.87 రీఫిల్స్‌కు 29 శాతం పెరిగింది.
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.100 తగ్గించింది. ఈ తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో LPG సిలిండర్ ఇప్పుడు రూ.803కి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications