LPG Cylinder: ఎన్నికలు సమీపించిన వేళ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనటానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తాయిలాలు అందిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే జాబితాలో గ్యాస్ సిలిండర్ వచ్చి చేరిపోయింది.
అవును.. హోలీ పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 2 కోట్ల కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లను అందిస్తోంది. గతేడాది యోగి ప్రభుత్వం ఈ బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారులకు ఏడాదికి రెండు సార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందించేందుకు స్కీమ్ ప్రవేశపెట్టింది. మెుదటిది దీపావళికి, రెండవది హోలీకి అందించబడుతోంది.

తాజాగా హోలీకి అర్హత కలిగిన 1.75 కోట్ల కుటుంబాలకు డొమెస్టిక్ సిలిండర్ల ఉచిత పంపిణీ ప్రజల్లో సంతోషాన్ని నింపుతోంది. ఉత్తరప్రదేశ్ నివాసితులైన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు దాని ప్రయోజనం పొందుతారు. అంటే రాష్ట్ర ప్రజలు మాత్రమే యూపీ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. అలాగే లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది.
దేశంలో ఉజ్వల పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించారు. 2016లో దీనిని తీసుకురావటంతో దేశంలో దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి. ఈ స్కీమ్ కింద.. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ అందిస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు ఈ సబ్సిడీ రూ.200గా ఉండేది. గతేడాది అక్టోబర్‌లో అదనంగా రూ.100 సబ్సిడీని పెంచుతున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications