For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

November 1st Rules: ఇన్సూరెన్స్ నుంచి రైలు వేళల వరకు.. నవంబర్ 1 నుంచి మార్పులివే..

|

November 1st Rules: నవంబర్ 1, 2022 నుంచి చాలా విషయాల్లో రూల్స్ మారుతున్నాయి. అవి ఇన్సూరెన్స్, గ్యాస్ నుంచి పీఎం కిసాన్, విద్యుత్ సబ్సిడీ వరకు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పకు తెలుసుకుని ముందుగా లబ్ధిదారులు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెల ప్రారంభంలో 8 అంశాల్లో రానున్న కొత్త మార్పుల గురించి ఇప్పుడు గమనిద్దాం.

ఇన్సూరెన్స్ KYC తప్పనిసరి..

ఇన్సూరెన్స్ KYC తప్పనిసరి..

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDA తాజా నిబంధనల ప్రకారం.. నాన్ లైఫ్ ఇన్సూరెనస్ పాలసీలను కొనుగోలు చేసేందుకు KYC తప్పనిసరి. గతంలో ఇది ఆఫ్షనల్ గా ఉంది. అయితే రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు ఇది తప్పనిసరి. కానీ మారిన రూల్స్ ప్రకారం నవంబర్ 1, 2022 నుంచి ఇది అందరికీ తప్పనిసరి కానుంది.

LPG- OTP రూల్స్..

LPG- OTP రూల్స్..

ప్రతి నెల మెుదటి తారీఖున ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మారుతుంటాయి. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ విషయంలో చమురు కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. అయితే తాజాగా నవంబర్ 1 నుంచి LPG సిలిండర్‌ను బుక్ చేసిన తర్వాత.. రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వస్తుంది. సిలిండర్ డెలివరీ సమయంలో ఈ OTPని తప్పక తెలపాల్సి ఉంటుంది. గ్యాస్ డీలర్లు చేస్తున్న అవకతవకలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రూల్ ప్రవేశపెట్టింది.

పీఎం కిసాన్ రూల్స్..

పీఎం కిసాన్ రూల్స్..

పీఎం కిసాన్ యోజన 12వ విడత కోసం డబ్బు పంపడానికి ముందు పెద్ద మార్పు చేయబడింది. ప్రస్తుతం లబ్ధిదారులైన రైతులు పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆధార్ నంబర్ ఉపయోగించి స్థితిని తనిఖీ చేయలేరు. ఇందుకోసం వారు ఇకపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఇవ్వవలసి ఉంటుంది. గతంలో రెండింటినీ వినియోగించే వెసులుబాటు ఉండేది.

GST రిటర్న్‌ మార్పు..

GST రిటర్న్‌ మార్పు..

జీఎస్టీ రిటర్న్స్‌లో మార్పులు వచ్చాయి. తాజా నిబంధనల ప్రకారం రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్‌లో నాలుగు అంకెల HSN కోడ్‌ను నమోదు చేయడం తప్పనిసరి. గతంలో ఏప్రిల్ 1 నుంచి రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు ఇది తప్పనిసరి చేయబడింది. ఆ తర్వాత వారికి ఆగస్టు 1 నుంచి ఆరు అంకెల కోడ్‌ను నమోదు చేయటం తప్పనిసరి అయింది.

ఢిల్లీలో మారిన రూల్స్..

ఢిల్లీలో మారిన రూల్స్..

ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీపై కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. దీని ప్రకారం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందేందుకు సబ్సిడీ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. దీనిని పూర్తి చేయని వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ నిలిచిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి తోడు ఎయిమ్స్‌లోని రోగుల నుంచి వసూలు చేస్తున్న రూ.300 యుటిలిటీ ఛార్జీలను రద్దు చేస్తున్నారు. ఎయిమ్స్‌లోని ఏదైనా విభాగంలో తయారు చేసిన కొత్త OPD కార్డును పొందడానికి రూ.10 రుసుమును కూడా తొలగించాలని నిర్ణయించారు.

ఆకాశ విమానాలు..

ఆకాశ విమానాలు..

నవంబర్ నుంచి ఆకాశ విమానాల్లో ప్రయాణించే వారు తమ పెంపుడు జంతువులను కూడా విమానంలో తీసుకెళ్లవచ్చని కంపెనీ గతంలోనే ప్రకటించింది. దీంతో పాటు నవంబర్ నుంచి కార్గో సర్వీసులను కూడా కంపెనీ ప్రారంభించనుంది.

రైలు షెడ్యూల్ మార్పు..

రైలు షెడ్యూల్ మార్పు..

నవంబర్ 1 నుంచి రైలు షెడ్యూల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైళ్ల టైమ్ టేబుల్‌ను మార్చబోతోంది. దీనికింద 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్ల టైమింగ్స్ మారిపోతున్నాయి. కాబట్టి మారుతున్న ప్రయాణ వివరాలను ప్రజలు తెలుసుకోవటం వారి ప్రయాణాన్ని సులభతరం చేయటంలో ఉపయోగపడుతుంది.

English summary

November 1st Rules: ఇన్సూరెన్స్ నుంచి రైలు వేళల వరకు.. నవంబర్ 1 నుంచి మార్పులివే.. | Know About Rules changing from November 1st From PM Kisan To LPG OTP

Know About Rules changing from November 1st From PM Kisan To LPG OTP
Story first published: Monday, October 31, 2022, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X