gas: ప్రజలు నిత్యం ఉపయోగించే ఖరీదైన వస్తువుల్లో ఒకటి వంట గ్యాస్. గతంలో ప్రభుత్వం కొంతమేర సబ్సిడీ ఇస్తూ, సామాన్యులకు అండగా నిలబడింది. కాలక్రమేణా దాన్ని ఎత్తివేయడంతో.. గ్యాస్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. వందల స్థాయిలో ఉన్న రేటు కాస్తా వెయ్యిని దాటిపోయింది. అయితే దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూసినట్లు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. గత నాలుగేళ్లలో ఈ విషయంలో జరిగిన మార్పులు ఏంటో, అవి భారతీయులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

అప్పటికీ, ఇప్పటికీ సంబంధమే లేదుగా..
గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండరుపై ప్రభుత్వం రూ.50 కొత్తగా వడ్డించింది. తాజా పెంపుతో, దాని ధర రూ.1103 చేరింది. గత నాలుగేళ్లతో పోలిస్తే 56% మేర వంటగ్యాస్ రేటులో వృద్ధి నమోదు అయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆధారంగా.. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. 2019లో రిటైల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.706 ఉండగా.. 2020లో 744, 2021లో 809, 2022లో 950 చొప్పున పెరిగాయి. ఇటీవల రూ.1,053 ఉన్న రేటు కాస్తా మార్చి 1 నుంచి రూ.1,103 కి ఎగబాకింది.

ఆకాశానికి గ్యాస్ ధర, పాతాళానికి సబ్సిడీ:
గ్యాస్ ధర అంతకంతకు పెరుగుతూ ఉంటే, సబ్సిడీ మాత్రం తగ్గుతూ వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలే స్వయంగా చెబుతున్నాయి. 2018-19 లో సబ్సిడీ కోసం రూ.37 వేల కోట్లకు పైగా సర్కారు ఖర్చు పెట్టగా.. 2019-20లో రూ.24 వేల కోట్లు, 2020-21లో 12 వేల కోట్లకి, 2021-22 వచ్చేసరికి రూ.1,811 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో 2019-20 లో సౌదీ క్రూడ్ ఆయిల్ రేటు.. సగటున మెట్రిక్ టన్నుకు 454 అమెరికన్ డాలర్లు ఉంది. 2022-23 ఫిబ్రవరి నాటికి ఇది 710 డాలర్లకు చేరింది. ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ఎప్పటికప్పుడు రేటులో ప్రభుత్వం మార్పులు చేస్తుంటుంది.

'ఉజ్వల' ద్వారా పేదలకు పెద్ద ప్రయోజనం:
ఉజ్వల పథకం కింద పేద మహిళలకు డిపాజిట్ లేకుండా LPG సిలిండర్ ఇవ్వడాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీని కింద 8 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. ఉజ్వల 2.0 వచ్చేసరికి పూర్వపు పథకానికి అదనంగా మొదటి రీఫిల్, స్టవ్ సైతం ఉచితంగా అందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 1.6 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. కరోనా వేళ పేదలను ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 3 రీఫిల్స్ ను ఉచితంగా అందజేశారు. 14.17 కోట్ల సిలిండర్లు ఈ సమయంలో బుక్ కాగా.. రూ.9,671 కోట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు తిరిగి చెల్లించాయి.

వన్ టైం సెటిల్ మెంట్:
LPG వాడకాన్ని మరింత పెంచడానికి 2022 నుంచి ఏడాదికి 12 సిలిండర్లపై రూ.200 సబ్సిడీని ఉజ్వల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ చర్యల ద్వారా తీవ్ర నష్టాల పాలైన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదుకునేందుకు.. వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.22 వేల కోట్లను ప్రభుత్వం జమచేస్తున్నట్లు తెలిసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications