For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Cylinder Prices: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. వినియోగదారులకు ఊరట.. ఎక్కడ ఎంతంటే..

|

LPG Cylinder Prices: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఊరట కలిగించే వార్తల ఇది. ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ ధరలను ఈ రోజు నుంచి తగ్గాయి. ఏఏ నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత మేర తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 1 నుంచి దేశంలో వాణిజ్య LPG సిలిండర్లు చౌకగా మారాయి. ఢిల్లీలో నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.198 తగ్గింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.2021కి తగ్గింది. గతంలో ఈ సిలిండర్ ధర రూ.2,219గా ఉంది. ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ధర గత నెలలో రెండోసారి తగ్గింది. అంతకుముందు జూన్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర జూన్ 1న రూ.135 తగ్గింది. అయితే.. సామాన్యులు ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రాజధాని ఢిల్లీలో July 1న రూ. 2,021, June 1న రూ. 2,219, May 19న రూ. 2,354, May 7న రూ. 2,346, May 1న రూ. 2,355.5, April 1న రూ. 2,253, March 22న రూ. 2,003, March 1న రూ. 2,012గా ఉన్నాయి.

lpg commercial gas cylinder rates reduced drastically from today

గత నెల జూన్‌లో కమర్షియల్ సిలిండర్ రేట్లు రూ.135 మేర తగ్గాయి. అయితే మేలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ల వినియోగదారులు రెండుసార్లు షాక్‌కు గురయ్యారు. మే 7న మొదటిసారిగా డొమెస్టిక్ సిలిండర్ రూ. 50 పెంచబడింది. మే 19న డొమెస్టిక్ LPG గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది.

English summary

LPG Cylinder Prices: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. వినియోగదారులకు ఊరట.. ఎక్కడ ఎంతంటే.. | lpg commercial gas cylinder rates reduced by 198 rupees from july 1st by government

lpg commercial gas cylinder rates reduced drastically from today
Story first published: Friday, July 1, 2022, 9:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X