LPG Price Cut: గ్యాస్‌పై పన్ను సున్నా చేసిన కేంద్రం.. కమర్షియల్ సిలిండర్ రేట్ల తగ్గింపు..
LPG Price Cut: ప్రతినెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల రేట్లను తగ్గిస్తాయనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది.
ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో మోదీ సర్కార్ హయాంలో రూ.800 మేర పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపును పొందింది. ఇది గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట అని చెప్పుకోవచ్చు. విపక్షాలు దీనిని ఎన్నికల తాయిలంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ద్రవ్యోల్బణ సమయంలో ప్రజల భారాన్ని కొంత తగ్గించటంలో దోహదపడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా 14.2 కిలోల సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. ఉజ్వల కింద వినియోగదారులు మెుత్తం రూ.400 తగ్గింపును పొందుతున్నారు.

ఇదే క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.157 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1522.50, కోల్‌కతాలో రూ.1,636, ముంబైలో రూ.1,482, చెన్నైలో రూ.1,695కి అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా మారిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పరిశీలించాలంటే తప్పకుండా iocl.com/prices లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇదే క్రమంలో కేంద్రం ప్రకటించిన రూ.200 తగ్గింపును కాంపెన్ సేట్ చేసే క్రమంలో చమురు కంపెనీలకు కూడా పన్ను ఊరటను కలిగించింది. అలా తగ్గించిన పన్ను మెుత్తాన్ని పరోక్షంగా తగ్గింపు పేరుతో ప్రజలకు అందించే ప్రయత్నం మోదీ సర్కార్ చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం దేశీయ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG), లిక్విఫైడ్ ప్రొపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్‌లపై దిగుమతులపై అమలులో ఉన్న 15 శాతం అగ్రి సెస్ మెుత్తాన్ని సెప్టెంబరు 1, 2023 నుంచి సున్నాకు తగ్గించింది. తద్వారా కంపెనీలు తగ్గింపు ధరలను ప్రభుత్వ హామీ మేరకు సామాన్యులకు అందించటానికి వీలు ఏర్పడింది.


Click it and Unblock the Notifications