For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు SBI అకౌంట్ ఉందా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్!

By girish
|

మీ దగ్గర ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? తరచూ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూసే. ఏటీఎంలో విత్‌డ్రా లిమిట్ తగ్గింది. అక్టోబర్ 31 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

అక్టోబర్ 31 నుంచి ఏటీఎంలో రూ.20,000 కన్నా ఎక్కువ డ్రా చేసుకోలేరు. ఇంతకుముందు ఈ లిమిట్ రూ.40,000 ఉండేది. రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. అయితే ఇటీవల ఏటీఎంల దగ్గర మోసాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదులు, మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అలవాటు చేసుకోవాలన్న కారణాలతో విత్‌డ్రా లిమిట్ తగ్గించినట్టు చెబుతోంది ఎస్‌బీఐ.

ఎస్‌బీఐ గోల్డ్ కార్డు

ఎస్‌బీఐ గోల్డ్ కార్డు

ఒకవేళ మీకు ఎక్కువ విత్‌డ్రా లిమిట్ కావాలనుకుంటే మాత్రం ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే క్లాసిక్, మ్యాస్ట్రో కార్డులపై మాత్రమే రూ.40,000 విత్‌డ్రా లిమిట్ ఉండేది. అది ఇకపై రూ.20,000 మాత్రమే. ఎక్కువ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులపై ఎలాంటి పరిమితి లేదు. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. సో మీ దగ్గర క్లాసిక్, మ్యాస్ట్రో కార్డులుంటే క్యాష్ విత్‌డ్రాకు ఇబ్బందులు తప్పవు.

SBI కస్టమర్లకి హెచ్చరిక

SBI కస్టమర్లకి హెచ్చరిక

ఇది డిజిటల్ యుగం. ఎలాంటి లావాదేవీలైనా స్మార్ట్‌ఫోన్‌పై జరిగిపోతుంటాయి. కాలు కదపకుండా కూర్చున్నచోటి నుంచే ట్రాన్సాక్షన్స్ చేయడం మంచి సదుపాయమే. కానీ ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడ ప్రమాదం కూడా పొంచే ఉంటుంది.

ట్రాన్సాక్షన్స్

మీరు కాలు కదపకుండా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారో సైబర్ నేరగాళ్లు కూడా కూర్చున్న చోటి నుంచే మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి మోసాల పట్ల అవగాహన కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేసేవారితో పరిచయం పెంచుకుంటూ మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకండి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. వెరిఫైడ్ అకౌంట్లు, అఫిషియల్ హ్యాండిల్స్‌నే ఫాలోకావాలని సూచిస్తోంది. ఎస్‌బీఐ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ట్వీట్ చేసింది.

ఎట్టిపరిస్థితుల్లో

ఎట్టిపరిస్థితుల్లో

మీ ఆర్థిక వివరాలన్నీ రహస్యంగా ఉంచాలని, సోషల్ మీడియాలో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేయకూడదని సూచిస్తోంది ఎస్‌బీఐ. సోషల్ మీడియా సైట్లల్లో ఫేక్ అకౌంట్స్‌ని అస్సలు పట్టించుకోకూడదని చెబుతోంది. వెరిఫైడ్ అకౌంట్లను 'బ్లూ రైట్ టిక్' చూసి గుర్తించొచ్చు. అవి తప్ప మిగతా ఏ అకౌంట్లను నమ్మినా, పరిచయం పెంచుకున్నా, స్నేహం చేసినా చివరకు మోసం తప్పదు.

వెబ్‌సైట్లల్లో

వెబ్‌సైట్లల్లో

జాగ్రత్తలు 1. https తో మొదలుకాని వెబ్‌సైట్లల్లో మీ కార్డు వివరాలు ఇవ్వకూడదు. అలాంటి వెబ్‌సైట్స్ సురక్షితం కావు. 2. మీరు బ్యాంకుకు ఇ-మెయిల్ రాయాలనుకుంటే... ముందు కాల్‌ సెంటర్‌కు కాల్ చేసి సరైన ఇ-మెయిల్ ఐడీ తీసుకోండి. 3. మీ వ్యక్తిగత వివరాలేవీ పర్సనల్ ఇ-మెయిల్‌లో ఉంచకూడదు

సరికొత్త సర్వీస్

సరికొత్త సర్వీస్

బ్యాంకుల్ని కస్టమర్లకు చేరువ చేస్తూ ఆదాయాన్ని పొందే మార్గం కల్పిస్తోంది బ్యాంక్ మిత్ర. చాలామందికి ఈ సర్వీస్ గురించి తెలియదు. మీరు కూడా బ్యాంక్ మిత్రగా మారి నెలకు 30-40 వేలు సంపాదించొచ్చు. అసలు బ్యాంక్ మిత్ర ఏంటీ? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏమేం సర్వీసులు అందించాల్సి ఉంటుంది? తెలుసుకోండి.

సింపుల్‌గా చెప్పాలంటే

సింపుల్‌గా చెప్పాలంటే

మీరు ఏ బ్యాంకుకైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. దీన్నే కస్టమర్ సర్వీస్ పాయింట్ అని కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ మిత్ర మినీ బ్యాంకుగా పనిచేస్తారు. అంటే బ్యాంకులో లభించే సర్వీసుల్లో చాలావరకు బ్యాంక్ మిత్ర అందిస్తారు. బ్యాంకు నుంచి నెలనెలా జీతంతో పాటు ఖాతాదారులకు అందించే సర్వీసుల ఆధారంగా కమిషన్ లభిస్తుంది.

బ్యాంక్ మిత్ర

బ్యాంక్ మిత్ర

మీరు ఏ బ్యాంకుకైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. దీన్నే కస్టమర్ సర్వీస్ పాయింట్ అని కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ మిత్ర మినీ బ్యాంకుగా పనిచేస్తారు. అంటే బ్యాంకులో లభించే సర్వీసుల్లో చాలావరకు బ్యాంక్ మిత్ర అందిస్తారు. బ్యాంకు నుంచి నెలనెలా జీతంతో పాటు ఖాతాదారులకు అందించే సర్వీసుల ఆధారంగా కమిషన్ లభిస్తుంది.

 ఖాతా తెరవడం

ఖాతా తెరవడం

బ్యాంకు మిత్ర చాలా సేవలు అందిస్తారు. ఖాతా తెరవడం, నగదు జమ చేయడం, విత్‌డ్రా చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రభుత్వ స్కీమ్‌లను ప్రజలకు చేరువ చేసే బాధ్యత బ్యాంక్ మిత్రది.

ఎవరైనా

ఎవరైనా

ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. వయస్సు 18 ఏళ్ల పైన ఉండాలి. కనీసం 10వ తరగతి పాస్ కావాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అయితే అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, 100 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉండాలి. సీఎస్పీ ఏర్పాటుకు లోన్ కూడా ఇస్తుంది బ్యాంకు.

 బీమా కంపెనీల

బీమా కంపెనీల

బ్యాంకు మిత్ర ఏర్పాటు గురించి బ్యాంకు వెబ్‌సైట్‌లో సమాచారం ఉంటుంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ సైనికులు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, కిరాణం, మెడికల్ షాప్ నిర్వాహకులు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు లేదా బీమా కంపెనీల ఏజెంట్ల లాంటి వారెవరైనా బ్యాంక్ మిత్రగా మారొచ్చు.

పత్రాలు

పత్రాలు

ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు). నివాస ధృవపత్రం, వ్యాపారం నిర్వహించే చిరునామా, 10వ తరగతి మెమో, పోలీసుల నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌బుక్, క్యాన్సల్డ్ చెక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి.

సేవింగ్స్ ఖాతా

సేవింగ్స్ ఖాతా

సేవింగ్స్ ఖాతా తెరవడం, లావాదేవీలు, ఆర్‌డీ, ఎఫ్‌డీ, ఓవర్‌డ్రాఫ్ట్ సేవ, కిసాన్ క్రెడిట్ సేవలు, ఇన్సూరెన్స్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్ అమ్మకాలు, పెన్షన్ అకౌంట్, అన్ని రకాల బిల్ చెల్లింపులు, టికెట్ బుకింగ్, పాన్ కార్డ్ సేవలు అందించొచ్చు.

Read more about: sbi
English summary

మీకు SBI అకౌంట్ ఉందా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్! | SBI WithDraw Limit Reduced To

Do you have an SBI account? Do you often draw money in ATM? But this is bad news for you. Withdraw limits reduced in ATM. The new norms will come into effect from October 31.
Story first published: Tuesday, October 30, 2018, 10:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X