Bhushan Steel case: బ్యాంకులను మోసం చేసి జనాల సొమ్ము దోచేస్తున్న బడా బాబులు దేశంలో ఎక్కువైపోయారు. ఈ కోవకి చెందిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తరహా వ్యక్తులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరికొందరిని మాత్రం మన ఏజెన్సీలు పట్టుకుని విచారణ జరుపుతున్నాయి.
భూషణ్ స్టీల్ (BSL) మాజీ ప్రమోటర్లు 56 వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. వారిలో కంపెనీ మాజీ బ్యాకింగ్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ కుమార్ తివారీ, అకౌంట్స్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ కుమార్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ జోహ్రీ, ప్రమోటర్ నీరజ్ సింగల్ బావ అజయ్ మిట్టల్ ఉన్నారు. వీరితో పాటు అజయ్ మిట్టల్ భార్య నీరజ్ సింగల్ మరియు సోదరి అర్చన మిట్టల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ సింగల్ తన సహచరులతో కలిసి అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తమ విచారణలో తేలిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. చైన్ సిస్టమ్ ద్వారా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి నిధులను మారుస్తూ వచ్చినట్లు గుర్తంచామని చెప్పింది. తద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను తప్పుదోవ పట్టించి, నష్టం కలిగించినట్లు వివరించింది.
ED వివరాల ప్రకారం.. ఈ నిధులను ఆయా కంపెనీల మూలధన అవసరాలు తీర్చడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి మరియు బ్యాంకులు అనుమతించని ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయి. నకిలీ పత్రాలను సిద్ధం చేసి, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (LC) కోసం బ్యాంకుల ముందు మోసపూరితమైన రిప్రజెంటేషన్‌లు చేశారు. ఆ నిధులను తిరిగి వారి స్వంత కంపెనీలకు మళ్లించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications