SBI services disruption: కొత్త ఆర్థిక ఏడాదిలో పలు బ్యాంకుల సేవలకు అంతరాయం ఏర్పడింది. మొదటిరోజే ఇలా జరగడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లిస్టులో ఉండటంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏప్రిల్ 1న 12.20 AM నుంటి 3.20 PM మధ్య SBIకి చెందిన వివిధ ఆన్‌లైన్ సేవలు స్తంభించిపోయాయి. ఏదైనా సమస్య తలెత్తి ఉండవచ్చని చాలా మంది భావించారు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో బిజినెస్ వెబ్ మరియు మొబైల్ యాప్, UPI సేవలు అందుబాటులో ఉండవని SBI ముందే తెలిపింది.

ఆర్థిక ఏడాది ముగింపు కార్యకలాపాల్లో భాగంగా ఈ ఆన్‌లైన్ సేవల లభ్యత ఉండబోదని పేర్కొంది. అదే సమయంలో UPI లైట్ మరియు ATM సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా స్పష్టం చేసింది. 2 వేల నోట్ల మార్పిడి మరియు డిపాజిట్స్ వంటి లావాదేవీలు ఏప్రిల్ 1న అంగీకరించబోమని వెల్లడించింది. ఏప్రిల్ 2 నుంచి ఆయా సేవలు పునఃప్రారంభించబడుతాయని తెలిపింది.
మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం HDFC కూడా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) కార్యకలాపాలు ఏప్రిల్ 1న అందుబాటులో ఉండవని కస్టమర్‌లకు తెలియజేసింది. ఇతర సేవల యాక్సెస్ కు కొంత ఆలస్యం కావచ్చని ముందుగానే వెల్లడించింది. ఇవికాక పలు ఇతర బ్యాంకులు ఏప్రిల్ 1న మూసివేయబడ్డాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications