నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కంపెనీకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం పేటీఎం షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు పేటీఎం టార్గెట్ ప్రైస్ రూ. 555 గా పేర్కొన్నారు. ఇ ది ప్రస్తుత స్థాయి నుంచి 52 శాతం ఎక్కువ. ఇటీవల, కొన్ని కార్యకలాపాలను నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ నిషేధం విధించింది.
దీంతో పేటీఎం స్టాక్ రోజురోజుకు లోయర్ సర్క్యూట్‌లను తాకుతూ వచ్చింది. అయితే, యాప్‌లో యూపీఐని ఉపయోగించి లావాదేవీలు చేయడానికి NPCI వినియోగదారులకు గ్రీన్‌లైట్ ఇచ్చినందున మార్కెట్ భాగస్వాములు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు పేటీఎం స్టాక్ 44 శాతానికి పైగా క్రాష్ అయింది. ఫిబ్రవరి 16, 2024న ఒక్కో షేరుకు రూ.318 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది.

మొబైల్ వాలెట్‌లు, స్టోర్ యాప్‌లు లేదా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే ఏదైనా ఇతర సిస్టమ్‌ని ఉపయోగించి యూపీఐ చెల్లింపులకు టీపీఏపీ సహాయం చేస్తుంది. ఎన్పీఐసీ యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ను అమలు చేస్తుంది. టీపీఏపీలు యూపీఐ సెటప్‌ను ఉపయోగిస్తాయి. లావాదేవీలను నిర్వహించడానికి చెల్లింపు సేవా ప్రదాతలు (PSPలు), బ్యాంకులతో సహకరిస్తాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై RBI ఆంక్షలు అమలులోకి రావడానికి ఒక రోజు ముందు NPCI ఆమోదం లభించింది. నాలుగు బ్యాంకులు - SBI, Axis Bank, HDFC బ్యాంక్, YES బ్యాంక్ Paytmకి చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లుగా పనిచేస్తాయి. మోర్గాన్ స్టాన్లీలోని విశ్లేషకులు ఈ చర్యను సానుకూల పరిణామంగా చెబుతున్నారు. "ఫిబ్రవరి 2024లో కంపెనీ వ్యాపారాలపై సంభావ్య ప్రభావం గురించిన అప్‌డేట్ కోసం మేము ఎదురుచూస్తూనే ఉంటాము. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం ఇతర బ్యాంకులకు తరలివెళుతున్నందున కంపెనీ కోసం అప్‌డేట్ అయిన వాణిజ్య ప్రకటనల కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications