SBI News: మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కాబోతోంది. దీనికి తోడు పండుగలు సైతం దగ్గరపడుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు పెద్ద శుభవార్త చెప్పింది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజాగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మారిన కొత్త రేట్లు డిసెంబర్ 27, 2023 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెల్లడించింది. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ తన వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవి 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య మెచ్చూర్ అయ్యే అన్ని డిపాజిట్లకు 3.5 శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అలాగే 46 నుంచి 179 రోజుల కాలానికి చేసే డిపాజిట్లపై బ్యాంక్ రేట్లను 25 పాయింట్లు పెంచింది. ఈ కాలానికి 4.75% వడ్డీ హామీ ఇస్తోంది. 180 నుంచి 210 రోజుల కాలపరిమితి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో పెట్టుబడిదారులు 5.75% వడ్డీ రేటును పొందుతారు. అలాగే 211 రోజుల కాలానికి చేసే 25 బేసిస్ పాయింట్లు రేట్లను పెంచి ఏడాది కంటే తక్కువ కాలవ్యవధికి 6 శాతానికి పెంచింది. 3 నుంచి 5 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే FDలు ఇప్పుడు 25 పాయింట్లు ఎక్కువ అంటే 6.75% ఆఫర్ చేస్తున్నారు. చివరగా 5-10 ఏళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై 6.50% వడ్డీని సాధారణ ఇన్వెస్టర్లకు ఆఫ్ చేస్తోంది.
ఇక సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే..
- 7 రోజుల నుంచి 45 రోజులు 4%
- 46 రోజుల నుంచి 179 రోజులు 5.25%
- 180 రోజుల నుంచి 210 రోజులు 6.25%
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి 6.5%
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7.30%
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7.50%
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7.25%
- 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు 7.5%


Click it and Unblock the Notifications