SBI Q3 Results: పూర్తిగా నిరాశ పరిచిన స్టేట్ బ్యాంక్.. 35 శాతం తగ్గిన లాభం.. కానీ..
SBI News: డిసెంబరుతో ముగిసిన కాలానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం గడచిన ఏడాది కంటే భారీగా క్షీణించటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది.
ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం భారీగా క్షీణించి రూ.9,163 కోట్లుగా నివేదించబడింది. అయితే ఏడాది కిందట ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం 35 శాతం అధికంగా రూ.14,205 కోట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు FY24లో మెుదటి 9 నెలల కాలానికి స్టేట్ బ్యాంక్ నికర లాభం ఏకంగా రూ.40,378 కోట్లుగా నివేదించబడింది. అయితే ఇది గత ఆర్థిక సంవత్సరంలో 20.40 శాతం తక్కువగా అంటే రూ.33,538 కోట్లుగా నిలిచింది.

మూడవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ రూ.1,05,733.78 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించిందని ఫలితాల్లో వెల్లడించబడింది. అయితే ఇందులో బ్యాంకు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.66,918 కోట్ల వడ్డీలను చెల్లించింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(NII) రూ.39,815 కోట్లుగా నమోదైంది. అయితే విశ్లేషకులు దీనిని రూ.40,304 కోట్లుగా అంచనా వేశారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 3.14% నుంచి 2.42%కి తగ్గింది. అలాగే త్రైమాసికంలో నికర NPA గత ఏడాది 0.77 శాతంతో పోలిస్తే 0.64 శాతంగా తగ్గి సానుకూలంగా నమోదైంది. దీంతో కంపెనీ ఆస్తుల నాణ్యత మాత్రం మెరుగుపడింది.
క్యూ3లో బ్యాంక్ నిర్వహణ లాభం రూ.20,336 కోట్లుగా ఉంది. విదేశీ కార్యాలయాల అడ్వాన్స్‌లు సంవత్సరానికి 13.90% పెరిగాయి. దేశీయ అడ్వాన్స్‌ల వృద్ధి SME అడ్వాన్స్‌ల ద్వారా (19.24% YoY) తర్వాత అగ్రి అడ్వాన్స్‌లు 18.12% వృద్ధి చెందాయి. అయితే శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఎస్బీఐ స్టాక్ ధర స్వల్పంగా లాభంతో రూ.648 వద్ద ముగిశాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే త్రైమాసిక ఫలితాలు తగ్గుదలను నమోదు చేయటంతో పెట్టుబడిదారులు సోమవారం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications