SBI: దూసుకెళ్తోన్న ఎస్బీఐ స్టాక్.. ఇంకా ర్యాలీ కొనసాగుతుందా..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్‌లో లాభాల కారణంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం కనిష్ట స్థాయి నుంచి 900 పాయింట్లకు పైగా పుంజుకుంది. 45,700 వద్ద స్థిర పడింది. వ్యక్తిగతంగా ప్రభుత్వ రంగ రుణదాతలపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిన నేపథ్యంలో SBI షేర్లు దాదాపు 5 శాతం లాభపడి 52 వారాల గరిష్ట స్థాయి రూ.747ను తాకాయి.
బడ్జెట్ ప్రారంభంలో అంచనా వేసిన దానికంటే తక్కువ రుణాలను తీసుకునే కార్యక్రమాన్ని వెల్లడించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు గత కొన్ని సెషన్లలో పెరుగుతూ వచ్చాయి. అంతేకాకుండా FY25 కొరకు GDPలో 5.1 శాతం తగ్గించిన ద్రవ్య లోటు లక్ష్యం కూడా స్థిరమైన స్థూల చిత్రాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది. బ్యాంక్ నిఫ్టీ 45,000-46,000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

"బ్యాంక్ నిఫ్టీ విస్తృత పరిధిలో కదులుతుందని అంచనా వేశారు. 45,000-46,000 లోపు స్థాయిలు అంచనా వేశారు. పుట్, కాల్ ఆప్షన్‌లలో గణనీయమైన బహిరంగ ఆసక్తికి ఉంది" డీప్ డిస్కౌంట్ బ్రోకర్ SAS ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు, CEO శ్రేయ్ జైన్ తెలిపారు. గడిచిన నాలుగు సెషన్లలో బ్యాంక్ నిఫ్టీ 45,800 నుంచి 44,800 పాయింట్లకు తగ్గింది. "ఇండెక్స్ 200-రోజుల మూవింగ్ ఆవరేజ్ 44,900 గా ఉంది. ప్రస్తుతం కీలక మద్దతు జోన్‌గా కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ రోజువారీ శ్రేణి 45,000-46,000గా ఉంటుంది" అని ఆమె తెలిపారు.
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ స్టాక్ బుధవారం గ్రీన్ లో ముగిసింది. బుధవారం 4 శాతం పెరిగింది. రూ.29 పెరిగి రూ.743 వద్ద స్థిర పడింది. ఎస్బీఐ గత 6 నెలల్లో 32 శాతం పెరిగింది. అంటే రూ.177 పెరిగింది.


Click it and Unblock the Notifications