SBI Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అధిక శాతం మందికి బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. కాగా వారందరిపై అదనపు భారాన్ని మోపేందుకు రెడీ అయింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి కొత్త వసూళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది.
ఏప్రిల్ 1, 2024 నుంచి బ్యాంక్ ఖాతాల వార్షిక నిర్వహణ రుసుమును SBI పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పలు ఇతర సర్వీసులకు కూడా ఛార్జీల మోత మోగిస్తోందని తెలుస్తోంది. ఇక క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ రుసుము గతంలో 125 + GST ఉండగా.. ఇప్పుడది కాస్తా 200 + GSTకి పెంచింది.

యువా, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ అనే ఇమేజ్ కార్డ్ కోసం గతంలో 175 + GST నిర్వహణ రుసుమును వసూలు చేసేది. దాన్ని ఇప్పుడు 250 + GSTకి చేర్చింది. SBI ప్లాటినం డెబిట్ కార్డ్‌ల కోసం యాన్యువల్ పర్సంటేజ్ రేట్(APR) గతంలో 250 + GST కాగా ఇప్పుడు ఏకంగా 75 పెంచి 325+ GSTగా మార్చింది.
ఇవే కాకుండా క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు ఇప్పటి వరకు బీమా ఛార్జీలు లేవు. కాగా ఇకనుంచి గోల్డ్ డెబిట్ కార్డ్‌లకు 100 + GST మరియు ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు 300 + GST విధించబడుతుంది. డెబిట్ కార్డ్ మార్పునకు 300 + GST, డూప్లికేట్ పిన్ లేదా పిన్ రీజనరేషన్‌కు 50 + GST ఛార్జ్ చేయనుంది. ATMలలో బ్యాలెన్స్ తనిఖీకి 25 + GST, ATM ఉపసంహరణ 100 (కనీసం) + 3.5 శాతం పన్ను + GST ఛార్జీలు వర్తిస్తాయి. వ్యాపార లావాదేవీలపైనా లావాదేవీల రుసుముపై 3 శాతం + GST విధించబడుతుంది.


Click it and Unblock the Notifications