ఆర్థికవృద్ధి తగ్గుదల, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా రూపాయి మారకపు రేటుపై ఒత్తిడి పడుతోంది. గత సంవత్సరం ఆసియా దేశాల్లో వరస్ట్ ప్రదర్శన చేసిన కరెన్సీలలో రూపాయి ఉండటం ఆందోళన కలిగించే అంశం. దక్షిణ కొరియా వోన్, పాకిస్తాన్ రూపాయిని మినహాయించి మన కరెన్సీ పడిపోయింది.

రూపాయి 2 శాతం, చైనీస్ కరెన్సీ 0.4 శాతం పడిపోయింది
2019 జనవరి ప్రారంభం నుంచి చూస్తే అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 2 శాతం మేర పడిపోయింది. అదే సమయంలో అమెరికా డాలరుతో పోలిస్తే థాయి బాహ్త్ 6.3 శాతం, మలేషియా రింగిట్ 1.5 శాతం, పిలిఫ్పైన్స్ పెసో 3 శాతం పడిపోయాయి. గత ఏడాది కాలంగా చైనీస్ రెన్మింబీ 0.4 శాతం పడిపోయింది.

కారణమిదే
భారత్‌లో ఆర్థికమాంద్యం ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని, ఈ కారణంగా రూపాయి పడిపోయిందనేది ఆర్థికవేత్తలు అభిప్రాయం. కరెన్సీ బలానికి, ఆర్థికవృద్ధికి సంబంధం ఉంటుంది. భారత్ స్థూల జాతియోత్పత్తి వృద్ధిలో భారీ పతనం కనిపించింది. దీంతో కరెన్సీపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు.

2008లో 20 శాతం క్షీణించిన రూపాయి వ్యాల్యూ
2019 క్యాలెండర్ ఇయర్లో ఈక్విటీ, డెబ్ట్ మార్కెట్లోకి 2 బిలియన్ల వ్యాల్యూ కలిగిన ఫారెన్ క్యాపిటల్ పెట్టుబడులు వచ్చినప్పటికీ రూపాయి విలువ క్షీణించిందని ఎక్వినోమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ చొక్కలింగం అన్నారు. మూలధన ప్రభావం రూపాయిపై పడిందన్నారు. ఉదాహరణకు 2008లో లెహమాన్ సంక్షోభం సమయంలో రూపాయి విలువ 20 శాతం పడిపోయిందన్నారు. గత సెప్టెంబర్‌లో కార్పోరేట్ పన్ను ట్యాక్స్ తగ్గించిన అనంతరం మూలధన ప్రవాహం మెరుగుపడిందన్నారు. అప్పుడు స్టాక్స్ ర్యాలీ అయ్యాయని చెప్పారు.

బంగ్లాదేశ్ టాకా మెరుగు..
డేటా ప్రకారం ఇప్పుడు భారత రూపాయి కంటే బంగ్లాదేశ్ టాకా మెరుగ్గా ఉంది. టాకా గత 12 నెలల్లో 1.5 శాతం తగ్గింది. భారత రూపాయిని 100 బేసిస్ పాయింట్స్ అధిగమించింది.

పాకిస్తాన్, దక్షిణ కొరియా కరెన్సీ భారీగా పడిపోయింది
పాకిస్తాన్ రూపాయి మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. గత 12 నెలల్లో పాకిస్తాన్ రూపాయి 9.5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో పాకిస్తాన్ రూపాయి 154.4 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది క్రితం ఇది 139.8గా ఉంది. పాకిస్తాన్ తర్వాత దక్షిణ కొరియా కరెన్సీ వోన్ భారీగా పడిపోయింది. ఇది ఏడాదిలో 5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో ఇది 1,167.1 వద్ద ట్రేడ్ అవుతోంది.

వృద్ధి రేటు
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా. వేగంగా అభివృద్ధి చెందుతన్న దేశాల్లో భారత్ వృద్ధి రేటు 2019లో గణనీయంగా పడిపోయింది. కాగా, డేటా ప్రకారం అత్యధిక ఆదాయం, ట్రేడ్ సెన్సిటివ్ సిటీలలో హాంగ్‌కాంగ్, సింగపూర్ ఉన్నాయి. చైనీస్‌కు వ్యతిరేకంగా ఆందోళనల కారణంగా హాంగ్‌కాంగ్, గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూమ్ తగ్గడంతో సింగపూర్‌లపై ప్రభావం పడింది.

పాకిస్తాన్ పరిస్థితి దారుణమే.. ఆసియా దేశాల కరెన్సీ ఇలా..
ఆసియా దేశాల్లో 2019లో పాకిస్తాన్ వృద్ధి రేటు గత ఏఢాది కంటే దారుణంగా పడిపోనుంది. 2018లో 5.5 శాతం ఉండగా, ఈసారి 3.3 శాతానికి పడిపోనుందని అంచనా. అయితే సౌత్ ఈస్ట్ ఆసియాలో మాత్రం వృద్ధి రేటు క్షీణత కాస్త తక్కువగా ఉంది. ఇండోనేషియా ఎకానమీ 5 శాతానికి పెరగనుందని అంచనా. ఫిలిప్సీన్, వియత్నా, చైనా, బంగ్లాదేశ్‌లలో 50 బేసిస్ పాయింట్లు, 20 బేసిస్ పాయింట్లు, 40 బేసిస్ పాయింట్లు, 10 బేసిస్ పాయింట్లు, సౌత్ కొరియాలో 70 బేసిస్ తగ్గే అవకాశముంది. భారత రూపాయి గత ఐదేళ్లలో నాలుగు సంవత్సరాలు నష్టపోయింది. గత పదేళ్లలో ఎనిమిదిసార్లు నష్టపోయింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications