ఇటీవల బ్యాంకు మోసాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న విజయ్ మాల్యా వాటిని చెల్లించకుండా విదేశాల్లో తలదాచుకున్నాడు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టాడు. తాజాగా మరో బ్యాంకు మోసం వెలుగుచూసింది. బ్యాంకులకు రూ.3,600 కోట్లు ముంచిన కార్పోరేట్ చీటర్స్‌పై సీబీఐ కేసును నమోదు చేసింది.

కేసు నమోదు
ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్, దాని డైరెక్టర్ల పైన సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్పూర్ జోనల్ ఆఫీస్ ఫిర్యాదుతో ముంబైకి చెందిన ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్, దాని డైరెక్టర్లు ఉదయ్ దేశాయ్, సుజయ్ దేశాయ్, మరో 11 మంది పైన చీటింగ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ అభియోగాల్ని నమోదు చేసింది. ఇందులో కాన్పూర్‌కు చెందిన ఆర్కే బిల్డర్స్, గ్లోబిజ్ ఎగ్జిమ్ ప్రయివేట్ లిమిటెడ్, నిర్మన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్‌కు కార్పోరేట్ గ్యారంటీర్లుగా ఉన్నాయి.

నకిలీ పత్రాలతో మోసం
తప్పుడుధ్రువపత్రాలు, నకిలీ సెక్యూరిటీలను చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 14 బ్యాంకులను రూ.3,592.48 కోట్లు మోసం చేశారని సీబీఐ పేర్కొంది. రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. నిందితులపై లుకౌట్ నోటీసులను జారీ చేశామని, వీరు దేశం విడిచి వెళ్లిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని సీబీఐ తెలిపింది.

సోదాలు
ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం 13 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ముంబై, ఢిల్లీ, కాన్పూర్‌లలో సోదాలు జరిగాయి. కంపెనీలో అలాగే ఉదయ్ దేశాయ్, సంజయ్ దేశాయ్, తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications