For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rupee: ఏమైంది మన రూపాయికి.. ఇలా అయితే కష్టమేనా..!

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి 25 పైసలు క్షీణించి 82.75 వద్దకు చేరుకుంది. విదేశీ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌, విదేశీ నిధుల తరలింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద, దేశీయ యూనిట్ డాలర్‌తో పోలిస్తే 82.74 వద్ద ప్రారంభమైంది. ఆపై దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 25 పైసల నష్టాన్ని నమోదు చేస్తూ 82.75కి దిగజారింది.

65 పైసలు క్షీణించి,

65 పైసలు క్షీణించి,

మంగళవారం రూపాయి 65 పైసలు క్షీణించి, యుఎస్ డాలర్‌తో పోలిస్తే ఒక నెల కనిష్ట స్థాయి 82.50 వద్ద ముగిసింది.

ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.09 శాతం పెరిగి 79.42 డాలర్లకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్నాయి. 30-షేర్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 148 పాయింట్లు క్షీణించి 62,478 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 50

నిఫ్టీ 50

విస్తృత ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 18,580 వద్ద ట్రేడవుతోంది. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నాడు రూ. 635.35 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేయడంతో క్యాపిటల్ మార్కెట్‌లలో నికర విక్రయదారులుగా మారారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది.

విదేశీ నిల్వలు

విదేశీ నిల్వలు

రూపాయి ధర పడిపోతుంటే దేశంలోని విదేశీ మరకం తగ్గిపోతుంది. అలానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా పలు దేశాలతో సంప్రదింపులు కూడా జరిపింది. స్థానిక రూపాయి కరెన్సీతో వర్తకం చేయాలని కేంద్రం భావిస్తోంది.

English summary

Rupee: ఏమైంది మన రూపాయికి.. ఇలా అయితే కష్టమేనా..! | The rupee fell 25 paise to 82.75 against the dollar on Wednesday

The rupee fell 25 paise to 82.75 against the US dollar in early trade on Wednesday, ahead of the Reserve Bank of India's monetary policy decision.
Story first published: Wednesday, December 7, 2022, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X