రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, భారత్ లో విదేశీ మారక నిల్వలు వరుసగా రెండవ వారం కూడా పెరిగాయి. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు మొత్తం $586.41 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారం కంటే ఇది $1.65 బిలియన్లు ఎక్కువ. గత వారంలో మొత్తం నిల్వలు 6.306 బిలియన్ డాలర్లు పెరిగి 584.755 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి.

ఏప్రిల్ 14తో ముగిసిన వారానికి USD 2.204 బిలియన్లు పెరిగి USD 516.635 బిలియన్లకు చేరుకుంది. US-యేతర లాభం లేదా తరుగుదల విలువ విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీలు డాలర్ పరంగా నిర్ణయించబడిన విదేశీ కరెన్సీ ఆస్తులలో చేర్చారు.
అపెక్స్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రిపోర్టింగ్ వారంలో IMFతో భారత్ రిజర్వ్ స్థానం USD 12 మిలియన్లు పెరిగి USD 5.19 బిలియన్లకు చేరుకుంది.భారతదేశం ఫారెక్స్ నిల్వలు వరుసగా రెండవ వారంలో పెరిగాయని BNP పరిబాస్ ద్వారా షేర్‌ఖాన్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు.
దేశీయ కరెన్సీలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఫారెక్స్ మార్కెట్లలో RBI జోక్యంతో ఏప్రిల్ 14, 2023న ఇది $584.76 బిలియన్ల నుంచి $1.657 బిలియన్ల పెరిగి $586.412 బిలియన్లకు చేరిందన్నారు. ఫారెక్స్ నిల్వలు 9-నెలల్లో అత్యధికంగా పెరిగాయన్నారు.
బంగారం నిల్వలు USD 521 మిలియన్లు తగ్గి USD 46.125 బిలియన్లకు చేరుకున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRలు) USD 38 మిలియన్లు తగ్గి USD 18.412 బిలియన్లకు చేరుకున్నాయి. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి విలు 81.77 నుంచి 82.09కు పడిపోయింది.
శుక్రవారం US డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు లాభపడి 82.09 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది. జాతీయ కరెన్సీ US డాలర్‌తో పోలిస్తే 82.11 వద్ద బాగా ప్రారంభమైంది. రూపాయి ఇంట్రా-డే-గరిష్టంగా 82.07 మరియు రోజు-కనిష్టంగా 82.19గా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications