For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేల ఉద్యోగాలు, USD 50 బిలియన్ల పెట్టుబడులు.. యూఎస్-ఇండియా మధ్య ఇదే కీలకం

|

న్యూఢిల్లీ: భారత్ - అమెరికా వ్యాపార సంబంధాల్లో ఇండియన్ ఐటి పరిశ్రమ కీలకమని, ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాల్ని ప్రోత్సహించడంలో ముఖ్యవాటాదారు అని ఇండియన్ రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు. ఈ ఐటీ ఇండస్ట్రీ పోటీతత్వానికి దోహదం చేస్తున్నాయని, అలాగే, అమెరికాలో వేలాదిగా ఉద్యోగాలు సృష్టిస్తున్నాయన్నారు. ఆయన ఓ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు.

వార్నింగ్ బెల్: ఈ-కామర్స్, ఐటీ సెక్టార్‌లో తగ్గనున్న ఉద్యోగావార్నింగ్ బెల్: ఈ-కామర్స్, ఐటీ సెక్టార్‌లో తగ్గనున్న ఉద్యోగా

అమెరికా-ఇండియా బంధానికి ఐటీ కీలకం

అమెరికా-ఇండియా బంధానికి ఐటీ కీలకం

ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెడుతున్నాయని హర్షవర్ధన్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడంలో, మద్దతు ఇవ్వడంలో ఇండియన్ ఐటి పరిశ్రమ ఒక ముఖ్యమైన వాటాదారు అన్నారు. భారతీయ ఐటి కంపెనీలు... యుఎస్ సంస్థల ప్రపంచ కార్యకలాపాల పోటీతత్వానికి దోహదపడ్డాయన్నారు. అలా చేయడం వల్ల అమెరికాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలు, వేలల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు.

50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు

50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు

ఓ అంచనా ప్రకారం... భారత ఐటి కంపెనీలు అమెరికాలో 50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థలు అమెరికన్ సొసైటీ మూలాల్లోకి చొచ్చుకెళ్లాయి. అమెరికాలో వారి కంట్రిబ్యూషన్ ఆర్థిక వ్యవస్థకు మించినదిగా ఉంది. హెచ్1బీ వీసా వంటి పరస్పర ప్రయోజన భాగస్వామ్యం ద్వారా హైస్కిల్డ్ ఇండివిడ్యువల్స్, ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు లబ్ధి చేకూరుతుందన్నారు.

సిబ్బంది కొరత... అమెరికన్లకు ఇండియన్ కంపెనీల ఉద్యోగాలు..

సిబ్బంది కొరత... అమెరికన్లకు ఇండియన్ కంపెనీల ఉద్యోగాలు..

నేడు అమెరికాలో హైటెక్ సెక్టార్‌లో 2.4 మిలియన్ల సిబ్బంది కొరత ఉందని హర్షవర్ధన్ చెప్పారు. ఇది మూడు శాతం కంటే తక్కువ నిరుద్యోగిత రేటుతో పాటు, ఈ రంగంలో అవసరమైన అనుభవం, నైపుణ్యం ఉన్న వ్యక్తుల కొరత స్పష్టంగా ఉందన్నారు. ఎక్కువ మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇండియన్ కంపెనీలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఉదాహరణకు ఇన్ఫోసిస్ 10,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందన్నారు. క్యాంపస్ టు క్యాంపస్‌కు రిక్రూట్మెంట్స్, వారికి శిక్షణ, వారు చేరబోయే హైటెక్ వృత్తికి వారిని సన్నద్ధం చేయడం వంటివి చేస్తున్నాయన్నారు. ఇటీవల గ్రీన్ కార్డు క్యాప్ ఎత్తివేయడాన్ని ఆయన ప్రశంసించారు. ఇది ఎంతోమంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.

అమెరికా-ఇండియా గ్రోత్‌కు నాస్‌కాం కంట్రిబ్యూషన్

అమెరికా-ఇండియా గ్రోత్‌కు నాస్‌కాం కంట్రిబ్యూషన్

నాస్‌కాం ప్రెసిడెంట్ దేబ్‌జని ఘోష్ మాట్లాడుతూ... భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు 78 బిలియన్ డాలర్ల అమ్మకాల్ని అందిస్తున్నాయని, భారత్ నుంచి నేరుగా సుమారు 1,70,000 ఉద్యోగాలు సృష్టించాయని, పరోక్షంగా ఒక మిలియన్ ఉద్యోగాలు సృష్టించాయన్నారు. భారతీయ సంతతికి చెందిన ఇండియన్ కంపెనీలు అమెరికాలో 16.3 బిలియన్ డాలర్ల వేతనాలు చెల్లిస్తున్నాయన్నారు. అలాగే, ఇండియాకు 185 బిలియన్ డాలర్లు, అమెరికా జీడీపీకి 58.2 బిలియన్ డాలర్ల మేర నాస్‌కాం కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. అమెరికాలో స్టేట్, ఫెడరల్‌కు పన్నుల పరంగా 7.7 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నామన్నారు.

English summary

వేల ఉద్యోగాలు, USD 50 బిలియన్ల పెట్టుబడులు.. యూఎస్-ఇండియా మధ్య ఇదే కీలకం | Indian IT key stakeholder in strengthening relations as it creates thousands of jobs in US

The Indian IT industry is an important stakeholder in promoting business relations between India and the US as it contributes to the competitiveness of global operations of American companies and creates thousands of jobs in the US, Indian envoy Harsh Vardhan Shringla has said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X