అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ఐటీ ఉద్యోగాలు ప్రస్తుత కాలంలో ఉద్యోగ భద్రతను అందించడం లేదు. ముఖ్యంగా ఈ AI టెక్నాలజీ యుగంలో జాబ్ అనేది దినదిన గండంగా మారింది. ఐటీ కార్మికులు నిరంతరం ఉద్యోగాల తొలగింపు బెదిరింపులకు గురవుతున్నారు. అమెరికా లాగా విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాలు పొందగలిగే భారతీయుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఒకవైపు వీసా ఆంక్షలు, మరోవైపు కంపెనీలు అకస్మాత్తుగా కార్మికులను తొలగించడంతో ఉద్యోగి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడు జీవితంలో సక్సెస్ ఎలా అయ్యాడు అని.. అవును అమెరికాలో పనిచేస్తున్న ఒక యువకుడు అకస్మాత్తుగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే జాబ్ పోయిందని బాధపడకుంగా.. టీ స్టాల్ తెరవడం ద్వారా విజయం సాధించాడు. ఇప్పుడు అతని వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిచోటా షేర్ అవుతున్నాయి.ఆ యువకుడి పేరే ప్రభాకర్ ప్రసాద్. అందరూ అతన్ని బీహార్ చాయ్ వాలా, చైగుయ్ అని పిలుస్తారు.

చిన్న పట్టణంలో పేద కుటుంబంలో జన్మించిన ప్రభాకర్ ప్రసాద్ జీవితాన్ని కష్టాలతో ప్రారంభించాడు. శీతాకాలంలో వేడి కోసం పప్పు బస్తాల కిందపడ్డ నిద్ర, తల్లిదండ్రుల నిరంతర పోరాటం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ అతనికి ఎన్నో పాఠాలు నేర్పాయి. తండ్రి ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్ద విజయం దొరకలేదు.అయినప్పటికీ ఆ తండ్రి కుమారుడికి విద్యను అందించడంలో ఎప్పుడూ రాజీ పడలేదు.
అనుకోకుండా ఓ రోజు ఆయన సోదరుడి కిడ్నాప్ ప్రయత్నం వల్ల కుటుంబం భయంతో బీహార్ వదిలి భోపాల్‌కు వలసివచ్చింది. కొత్త నగరంలో, కొత్త పాఠశాలలో, ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోవడంతో తోటి విద్యార్థులు ఆతని ఇంగ్లీష్ ఉచ్చారణను చూసి నవ్వేవారు. అయినా అతను పట్టుదలతో ప్రతి రోజు కష్టపడి చదివాడు. చివరికి IIT పరీక్షలో విజయం సాధించాడు.IIT లో అడ్మిషన్ అతని జీవితం మార్చేసింది.
డిగ్రీ పూర్తయిన తరువాత 2008లో మొదటి ఉద్యోగం సంపాదించాడు. కానీ టెక్ పనిలో హృదయం సంతోషం పొందలేకపోయింది. శారీరక వ్యాయామం, జిమ్, మోడలింగ్.. ఇలాంటి చిన్న ఆసక్తులు ఆయనలో ఉత్సాహం, ఆనందాన్ని తెచ్చాయి. ముంబైలో మోడలింగ్ ప్రయత్నాలు, లాంగ్ క్యూలు, చిన్న ఫ్లాట్స్ అన్ని ఓర్పుతో ఎదుర్కొన్నాడు.తర్వాత MBA కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వీసా రెండుసార్లు తిరస్కరించబడినా.. 2014లో అమెరికాలో అడుగుపెట్టగలిగాడు.
కొత్త దేశంలో ఒంటరితనం, విడిపోవడం, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు.. ఇలా పది సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఉద్యోగం నుండి ఉద్యోగం, నగరం నుండి నగరం-అందులో సంతోషం తక్కువ, బాధ ఎక్కువగా కనిపించేవి. అయితే 2025లో కృత్రిమ మేధస్సు (AI) ఆయనను వెంటాడింది. అతని కంపెనీ అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయింది, కాబట్టి అతను ఏమి చేయాలో తెలియక చాలా చోట్ల పని కోసం వెతికాడు.
ఆ సమయంలో చిన్నప్పటి ఇంటి వాసన, కుటుంబం గుర్తుచేసే టీ వైపు ఆయన మనసు మళ్లింది. తక్కువ పెట్టుబడితో, లాస్ ఏంజిల్స్‌లో భారతీయ శైలిలో చాయ్ స్టాల్ ప్రారంభించాడు. ఆయన చేతులతో తియ్యగా చేసిన చాయ్.. చక్కెరతో కలిపి స్థానికులలో పెద్ద హిట్ అయింది.అతను ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది.నెలల కష్టాల తర్వాత ప్రభాకర్ ఈ రంగంలో ఘన విజయాన్ని సాధించాడు. సాంప్రదాయ బిహారీ గమ్చా ధరించి, చిరునవ్వుతో చాయ్ సర్వ్ చేస్తూ రీల్ పోస్ట్ చేసినప్పుడు.. ప్రేక్షకుల హృదయాలను తాకాడు. ఈ సన్నివేశం ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెచ్చింది.
సోషల్ మీడియాలో, లాస్ ఏంజిల్స్ వీధుల్లో అతన్ని ప్రేమగా చైగుయ్ అని పిలుస్తారు. అతను ఒక టీని 8 డాలర్లు లేదా రూ. 780 కి అమ్ముతాడు. ఇది అతనికి చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, అతను ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగానని, అనేక కార్పొరేట్ కంపెనీలలో పనిచేశానని, పని అనుభవాన్ని పొందానని చెప్పాడు. ఐటీలో పనిచేస్తున్నప్పటికీ, ఈ టీ దుకాణం వ్యాపారంలో తనకు ఎంతో సంతృప్తి లభించిందని ఆయన చెబుతున్నారు.
తాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తనకు చాలా డబ్బు ఉండేది కానీ స్వేచ్ఛ తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు తనకు చాలా స్వేచ్ఛ, మనశ్శాంతి ఉందని ఆయన చెబుతున్నారు. అమెరికాలో తన 10 సంవత్సరాల ఐటీ ఉద్యోగం తనకు ఇవ్వని సంతృప్తిని ఈ స్వయం ఉపాధిలో పొందుతున్నానని ఆయన చెబుతున్నారు.


Click it and Unblock the Notifications