పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసుకుంటున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుధ్దం ప్రవంచ యవనికపై ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ అయితే రక్తపాతాన్నే చూస్తోందని చెప్పవచ్చు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని పెట్టుబడిదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు అయితే దీనికి ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే అంశం మా చేతుల్లో ఉందని ట్రంప్ చేతుల్లో లేదని తేల్చి చెప్పింది. యుద్ధం ముగింపును నిర్ణయించేది మనమే అంటూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఓ ప్రకటనలో తెలిపింది.

పశ్చిమాసియా భవిష్యత్ పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ సాయుధ దళాల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికా లేదా ఇతర దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకోలేవంటూ IRGC గట్టిగా బదులిచ్చింది. ఇక ట్రంప్ గతంలో ఈ యుద్ధం త్వరలో ముగిసిపోవచ్చు అని వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ సుప్రీం నాయకుడు మసౌద్ పెజెష్కియన్ నియామకం తర్వాత పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యాయి.
టెహ్రాన్ తీసుకున్న నిర్ణయంతో స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ముఖ్యంగా ముడి చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరేలా ఉంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. అందువల్ల ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లకు షాక్ కు గురిచేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ IRGC జలమార్గాన్ని కొంతకాలం అడ్డేసి.. దాదాపు 10 నౌకలు దాడి చేయబడ్డాయని AFP నివేదిక తెలిపింది. MSC గల్ఫ్ వంటి షిప్పింగ్ దిగ్గజాలు ఎగుమతులను నిలిపివేసి, సరుకులను ఆవశ్యకంగా నిల్వ చేస్తున్నారు.
ప్రాంతీయ దేశాల ప్రతిస్పందన కూడా వ్యూహాత్మకంగా ఉంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా రక్షణాత్మక మిషన్ కింద రివాస్టు చేసేందుకు దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. బహ్రెయిన్, ఖతార్, కువైట్‌లలోని చమురు సంస్థలు ఫోర్స్ మేజ్యూర్ ప్రకటించి.. ఎగుమతులు సాధ్యమైనంత వరకు నిలిపివేయనున్నాయి. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ, తూర్పు ఎమిరాటీ సరిహద్దులో డ్రోన్ దాడులను అడ్డుకుంది.
ట్రంప్ ఈ పరిణామాలను తక్షణం స్వల్పకాలికంగా చూసి.. మయామి గోల్ఫ్ క్లబ్‌లో ఇది చిన్న విహారయాత్రలా ఉంటుందని వ్యాఖ్యానించినప్పటికీ, నిజానికి ఇరాన్ కొత్త కఠిన వైఖరితో, సుప్రీం నాయకుడి కర్ణంతో ప్రాంతీయ సమీకరణాలను నియంత్రిస్తోంది. ఈ పరిణామం ప్రపంచ చమురు, గ్యాస్ ధరలకు, US ఇంధన మార్కెట్లకు, మరియు అంతర్జాతీయ వ్యాపారాలకు ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.
ఇక ఇరాన్ తో సాగుతున్న యుద్ధం డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. యుద్ధాన్ని సాగదీయడం వల్ల రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన సలహాదారులు భయపడుతున్నారు. అందువల్ల యుద్ధం నుంచి వెంటనే వైదొలగాలని (ఎగ్జిట్ ప్లాన్) అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం కూడా ఆందోళనకు కారణం అని చెప్పవచ్చు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య భారీ ఖర్చుతో సాగుతోంది. war ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే కేవలం అత్యాధునిక ఆయుధాల కోసం అమెరికా సుమారు 5.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇందులో సైనిక బలగాల తరలింపు, నౌకలు, విమానాల నిర్వహణ ఖర్చులు లేవు.
ఈ స్థాయిలో దాడులు కొనసాగితే అమెరికా కీలకమైన ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతాయని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించడం, ఆసియాలో సైనిక చర్యలతో అమెరికా నిల్వలపై ఒత్తిడి ఉంది. ఇరాన్ యుద్ధం ఈ ఒత్తిడిని మరింత పెంచింది. ఈ ఘర్షణలో ఇప్పటివరకు ఏడుగురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ఎఫెక్ట్.. ధరల పెరుగుదలపై ఆందోళన..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్‌రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఖతార్ LNG ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..



Click it and Unblock the Notifications