For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తుది అంకానికి చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం!

|

వాషింగ్టన్/ఢిల్లీ: అమెరికా-చైనా, అమెరికా-ఇండియా మధ్య గత కొంతకాలంగా వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయని కొద్ది రోజుల క్రితం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలాకాలంగా వేచి చూస్తున్న అమెరికా - ఇండియా వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు వచ్చే వారం అమెరికా ప్రతినిధులు భారత్ రానున్నారు.

వరుసగా మూడో రోజు... పెరిగిన బంగారం ధరలు, కారణాలివేవరుసగా మూడో రోజు... పెరిగిన బంగారం ధరలు, కారణాలివే

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నవంబర్ 12న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు అక్కడి ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఒప్పందంలో సంక్లిష్యంగా మారిన మెడికల్ డివైస్‌లు, టారిఫ్, జీఎస్పీ వంటి అంశాలపై ఓ అవగాహన కుదిరినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం అక్కడి పారిశ్రామిక వర్గాలతోను గోయల్ భేటీ అవుతున్నారు.

US officials to travel to India next week to further US India trade talks

గత జూన్ నెలలో భారత్‌ను ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) జాబితా నుంచి అమెరికా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు చెందిన ఉత్పత్తులపై అగ్రరాజ్యం అధిక టారిఫ్ విధించింది. దీనికి ప్రతిగా అమెరికా వస్తువులపై భారత్ టారిఫ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటి పరిష్కార దిశగా రెండు దేశాల ప్రతినిధులు, మంత్రులు చర్చలు జరుపుతున్నారు.

English summary

తుది అంకానికి చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం! | US officials to travel to India next week to further US India trade talks

A delegation of officials from the United States will travel to India next week to give final touches to the India-US trade deal.
Story first published: Friday, November 15, 2019, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X