విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..
టీమిండియా జూలు విదిల్చింది. అహమ్మదాబాద్ వేదికగా Narendra Modi Stadiumలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఊచకోత కోసింది. తొలుత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడితే తరువాత బౌలర్లు నిప్పులు చేరిగా బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించారు. ICC Men's T20 World Cup 2026 ఫైనల్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచారు. మరి విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత.. ఇండియా టీం ఎంత బహుమతి గెలుచుకుందో ఓ సారి చూద్దామా..
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 27.48 కోట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14.65 కోట్లు) బహుమతిగా అందాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ పూల్ సుమారు 13.5 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 120 కోట్లకు పైగా ఉంది. టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించింది.

సెమీ ఫైనల్స్ వరకు చేరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లు కూడా భారీ మొత్తాన్ని అందుకున్నాయి. ఈ దశలో ఓడిపోయిన South Africa national cricket team, England national cricket team ఒక్కొక్కటి 790,000 డాలర్లు (దాదాపు రూ.7.24 కోట్లు) పొందాయి. అలాగే సూపర్-8 దశకు చేరుకున్న కానీ సెమీ ఫైనల్స్‌కు వెళ్లలేని జట్లు ఒక్కొక్కటి 380,000 (సుమారు 3.48 కోట్లు) సంపాదించాయి. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు కూడా 250,000 డాలర్లు (దాదాపు రూ. 2.29 కోట్లు) అందుకున్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. స్టార్ బ్యాటర్ Sanju Samson అద్భుతంగా ఆడి కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. అతని దూకుడు ఇన్నింగ్స్‌తో భారత్ 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరు టి20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్లలో ఒకటిగా నిలిచింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా స్టార్ పేసర్ Jasprit Bumrah అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులకే నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ Axar Patel కూడా మెరుగైన ప్రదర్శన చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. India దూకుడైన బౌలింగ్‌కు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైన్-అప్ పూర్తిగా కుదేలై 159 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ విజయంతో భారత్ టి20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. అభిమానులతో నిండిన నరేంద్ర మోడీ స్టేడియంలో ట్రోఫీని ఎగరేసిన క్షణం భారత క్రికెట్ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది. ఈ విజయం భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్‌లో మరింత గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. భారీ ప్రైజ్ మనీతో పాటు అభిమానుల ఆనందం, జట్టు ప్రదర్శన..ఇవన్నీ కలిసి ICC T20 ప్రపంచకప్ 2026 ను భారత్‌కు చిరస్మరణీయంగా మార్చాయి.


Click it and Unblock the Notifications