For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలో రూ.125 కోట్ల కుంభకోణం కేసులో ఎన్నారై

|

అమెరికాలో బ్యాంకుకు లక్షల కోట్ల డాలర్లు మోసగించిన కేసులో ఓ భారతీయ అమెరికన్‌ను దోషిగా తేల్చింది అగ్రరాజ్య న్యాయస్థానం. న్యూజెర్సీకి చెందిన మార్బుల్, గ్రానైట్ హోల్‌సేల్ వ్యాపారి అరవై ఒక్క సంవత్సరాల రాజేంద్ర 17 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) రుణానికి సంబంధించి బ్యాంకును మోసం చేసే ప్రయత్నాల్లో తన పాత్రను అంగీకరించినట్లుగా యూఎస్ అటార్నీ తెలిపారు. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి సుశాన్ డీ విజింటన్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడని తెలుస్తోంది.

కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?

నేరానికి పాల్పడినట్లుగా రుజువు

నేరానికి పాల్పడినట్లుగా రుజువు

రాజేంద్ర ఆర్థిక నేరానికి పాల్పడినట్లుగా కోర్టులో రుజువైంది. ప్రస్తుతం ఆయన మూతబడిన లోటస్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనకు ఆ సంస్థలో వాటాలు ఉన్నాయి. ఓ అమెరికన్ బ్యాంకు నుండి అక్రమంగా రుణం పొందడానికి నాలుగేళ్ల క్రితం 2016 మార్చి నుండి 2018 మార్చి మధ్య కాలంలో తన ఉద్యోగుల సహకారంతో ప్లాన్ చేశారు. రుణాలు పొందేందుకు తగినన్ని స్థిరాస్తులు లేకపోవడంతో సంస్థలోని ఉద్యోగుల సహకారంతో ఆన్‌లైన్ మోసానికి పాల్పడ్డాడు.

ఉద్యోగుల పేరుపై నకిలీ ఖాతాలు తెరిచి

ఉద్యోగుల పేరుపై నకిలీ ఖాతాలు తెరిచి

ఇందులో భాగంగా సంస్థ ఉద్యోగులే తమ వినియోగదారుల పేరు మీద నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను తెరిచారు. సంస్థను గురించి, బ్యాంకు, ఆడిటర్లకు తాము ఈ సంస్థకు భారీ మొత్తాలు బకాయి ఉన్నామని, వాటిని త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇది వాస్తవం అని భావించిన బ్యాంకు ఆ సంస్థకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంకుకు 17 మిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని అమెరికా కోర్టులో రుజువైంది.

30 ఏళ్ల జైలు శిక్ష

30 ఏళ్ల జైలు శిక్ష

ఈ కేసుకు సంబంధించి పలు మోసపూరిత ఖాతాలు ఉండటంతో పాటు, ఇందులో బకాయిలు పెంచి లేదా కల్పితమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరానికి గాను అతనికి గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ డాలర్ల జరిమానాను విధించే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు జనవరి 18వ తేదీన శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.

English summary

అమెరికాలో రూ.125 కోట్ల కుంభకోణం కేసులో ఎన్నారై | Indian American Pleads Guilty In USD 17 Million Bank Fraud

An American attorney said an Indian American president of a New Jersey based marble and granite wholesaler has acknowledged his role in planning to defraud a bank in connection with a $ 17 million line of safeguards.
Story first published: Wednesday, September 16, 2020, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X