For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. మందగమనం నేపథ్యంలో ఆమె ఏయే రంగాలకు ఊరట కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కార్పోరేట్ ట్యాక్స్, జీఎస్టీ, వ్యక్తిగత ఆదాయపు పన్ను.. ఇలా ఎన్నో రకాల పన్నులు భారత్‌లో తక్కువగా ఉన్నాయా? అంటే ఈ కథనం చదవాల్సిందే. పన్నులు తక్కువ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే వివిధ దేశాల ట్యాక్స్ జీడీపీ రేషియో ఎలా ఉందో చూడండి...

బడ్జెట్ పైన మరిన్ని కథనాలు

అగ్రస్థానంలో OECD దేశాలు

అగ్రస్థానంలో OECD దేశాలు

2017-18లో భారత్ ట్యాక్స్ డీజీపీ రేటు 17 నుంచి 17.5 శాతం వరకు ఉంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ డెవలప్‌మెంట్ (OECD) దేశాల్లో ఇది 2018లో 34.3 శాతంగా ఉంది. OECDలో 36 దేశాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలున్నాయి. దీంతో వీటి ట్యాక్స్ జీడీపీ రేషియో ఎక్కువగా ఉంటుంది.

అమెరికాతో భారత్‌ను పోలిస్తే...

అమెరికాతో భారత్‌ను పోలిస్తే...

ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశం ట్యాక్స్ జీడీపీ రేషియో 46 శాతం, డెన్మార్క్, బెల్జియం 45 శాతం, స్వీడన్ 44 శాతం, ఫిన్‌లాండ్ 42 శాతం... ఉన్నాయి. అమెరికా ట్యాక్స్ జీడీపీ రేషియో 2018లో 24 శాతంగా ఉంది. అమెరికా, భారత్ తలసరి ఆదాయాల్లో గణనీయ వ్యత్యాసం ఉంది. కాబట్టి అమెరికాతో పోలిస్తే భారత్ ట్యాక్స్ జీడీపీ రేషియో అంత బ్యాడ్‌గా అనిపించదు. 2018లో అమెరికా తలసరి ఆదాయం 63,000 డాలర్లు కాగా, భారత్‌ది 2,020 డాలర్లు.

మలేషియా, ఇండోనేషియాల కంటే బెట్టర్

మలేషియా, ఇండోనేషియాల కంటే బెట్టర్

దక్షిణ కొరియా ట్యాక్స్ జీడీపీ రేషియో 27 శాతం, తలసరి ఆదాయం 31,000 డాలర్లు. రష్యా ట్యాక్స్ జీడీపీ రేషియో 17 శాతం, తలసరి ఆదాయం 11,000 డాలర్లు. సౌత్ ఈస్ట్ ఏసియా దేశాలైన మలేషియా, ఇండోనేషియాలతో పోలిస్తే భారత్ ట్యాక్స్ జీడీపీ రేషియో బావుంది. మలేషియా ట్యాక్స్ జీడీపీ రేటు 16.5 శాతం, తలసరి ఆదాయం 11,400 డాలర్లు, ఇండోనేషియా ట్యాక్స్ జీడీపీ రేషియో 13 శాతం, పర్ క్యాపిటా 3,893 డాలర్లు.

చైనా సహా సరిహద్దు దేశాలతో పోలిస్తే..

చైనా సహా సరిహద్దు దేశాలతో పోలిస్తే..

భారత్ సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్ ట్యాక్స్ జీడీపీ రేషియో 9.6 శాతం కాగా శ్రీలంకది 13.8 శాతం. చైనా ట్యాక్స్ జీడీపీ రేషథియో 21 శాతం, తలసరి 9,770 డాలర్లుగా ఉంది. చైనా సహా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పన్నులు ఘోరంగా ఏమీ లేవని అర్థమవుతోంది.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వాటా..

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వాటా..

ట్యాక్స్ జీడీపీ రేషియో పరంగా చూస్తే భారత్ తక్కువ పన్నులు విధించే దేశంగా చెప్పడానికి లేదని అంటున్నారు. దేశ ఆదాయంలో ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పరోక్ష, వినియోగ పన్నుల (జీఎస్టీ, అమ్మకపు పన్ను, ఆస్తి పన్ను వంటివి...) పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. భారత్‌లో పరోక్ష పన్నుల నిష్పత్తి 65 శాతం. ప్రత్యక్ష పన్నులు (కార్పోరేట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను) 35 శాతం మాత్రమే. OECD దేశాల ఆదాయపు పన్ను దాదాపు 24 శాతం. కార్పోరేట్ ట్యాక్స్9 శాతంగా ఉంటుంది. పరోక్ష, వినియోగ పన్నులు 38 శాతం.

అందుకే ఎక్కువ ఆదాయపు పన్ను లేదని భావిస్తారా?

అందుకే ఎక్కువ ఆదాయపు పన్ను లేదని భావిస్తారా?

2017-18 నాటికి భారత్‌లో 85 మిలియన్ల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. దేశ జనాభాలో ఇది 6 శాతం. అదే అమెరికా, యూకేలలో జనాబాలో 42 శాతం నుంచి 45 శాతం మంది ఉన్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు భారత్‌లో తక్కువగా ఉన్నారని, అందుకే అండర్ ట్యాక్స్ లేదా ఎక్కువ పన్నులు లేని దేశంగా భారత్‌ను భావిస్తారని అంటున్నారు. అదే సమయంలో కార్మిక భాగస్వామ్య రేటు, తలసరి వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని కూడా అంటున్నారు.

యువ భారత్.. చైనా, అమెరికాతో పోలిస్తే..

యువ భారత్.. చైనా, అమెరికాతో పోలిస్తే..

భారత్‌లో యంగ్ ఇండియా 26 శాతంగా ఉంది. చైనాలో ఇది 17 శాతంగా ఉంది. లేబర్ భాగస్వామ్యం మాత్రం 52 శాతమే. చైనాలో ఇది 68 శాతం. లేబర్ ఫోర్స్‌లో మహిళల పార్టిసిపేషన్ భారత్‌లో 23 శాతంగా ఉంటే, చైనాలో 61 శాతం, అమెరికాలో 56 శాతంగా నమోదయింది. ఇక, వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్న లేబర్ ఫోర్స్‌పై ట్యాక్స్ లేదు.

అసలు ట్యాక్స్ పేయర్స్ ఎక్కువగా లేకపోవడమే..

అసలు ట్యాక్స్ పేయర్స్ ఎక్కువగా లేకపోవడమే..

ముఖ్యంగా ట్యాక్స్ చెల్లించేవారు ఎక్కువగా లేరు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం 2019-20లో తలసరి ఆదాయం రూ.1,35,050గా ఉంటుందని అంచనా. 2018-19లో ఇది రూ.1,26,406గా ఉంది.

2018-19లో ఆయా దేశాల ట్యాక్స్ పేయర్స్ శాతం

2018-19లో ఆయా దేశాల ట్యాక్స్ పేయర్స్ శాతం

- అమెరికా ట్యాక్స్ జీడీపీ రేషియో 24 శాతం, తలసరి 62,794 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 141 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 43 శాతం.

- యూకే ట్యాక్స్ జీడీపీ రేషియో 33 శాతం, తలసరి 43,000 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 31 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 46 శాతం.

- జపాన్ ట్యాక్స్ జీడీపీ రేషియో 31.5 శాతం, తలసరి 39,290 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 50 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 40 శాతం.

- చైనా ట్యాక్స్ జీడీపీ రేషియో 21 శాతం, తలసరి 9,770 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 145 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 10 శాతం.

- బ్రెజిల్ ట్యాక్స్ జీడీపీ రేషియో 34 శాతం, తలసరి 8,920 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 28 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 13 శాతం.

- భారత్ ట్యాక్స్ జీడీపీ రేషియో 17.5 శాతం, తలసరి 2,020 డాలర్లు. ట్యాక్స్ పేయర్లు 85 మిలియన్లు ఉన్నారు. జనాభాలో ఇది 5.80 శాతం.

English summary

భారత్‌లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా? | Budget 2020: Is India an under taxed country?

The tax-GDP ratio of the country (after including the Centre and states' tax revenue) was 17-17.5 per cent till 2018-19. This is almost half of the average tax-GDP ratio of Organisation for Economic Corporation and Development (OECD) countries, which was 34.3 per cent in 2018.
Story first published: Wednesday, January 29, 2020, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X