వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..
అమెరికా శుక్రవారం వెనిజులా నుండి 100 మిలియన్ డాలర్ల బంగారాన్ని తీసుకువచ్చిందని అమెరికా అంతర్గత కార్యదర్శి డగ్ బర్గమ్ ధృవీకరించారు. ఈ బంగారం పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడనుందని తెలిపారు. బర్గమ్ మాట్లాడుతూ అమెరికా.. వెనిజులాలోని అరుదైన ఖనిజ వనరులను అన్వేషించడానికి ప్రణాళికలు వేస్తోందని తెలిపారు. ఆయన వెల్లడించినట్లుగా వెనిజులాలో 500 బిలియన్ డాలర్ల విలువైన బంగారపు నిల్వలు ఉన్నాయి. వీటిలో బాక్సైట్, అల్యూమినియం వంటి ఇతర సిరిటికల్ ఖనిజాలు కూడా ఉన్నాయి, ఇవి రక్షణ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగ వస్తువుల తయారీలో కీలకంగా ఉపయోగపడతాయి.
ఈ కొత్త బంగారం ఉత్పత్తి చైనాతో AI ఆయుధ పోటీలో అమెరికాకు సహాయపడుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా మైనింగ్, చమురు వనరులను సమృద్ధిగా ఉపయోగించేందుకు మద్దతునిచ్చినందుకు, స్థానిక ప్రజలు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన తెలిపారు. గత వారం అమెరికా చమురు, గ్యాస్, మైనింగ్ అధికారులతో వెనిజులా ప్రయాణం జరిగినప్పుడు.. స్థానికులు తిరిగి వచ్చి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.

జనవరి 2026లో అమెరికా.. వెనిజులాలో సైనిక చర్యలు ప్రారంభించి, అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్యను బందీలుగా పట్టుకుంది. నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో వారిని అమెరికాకు తరలించింది. వెనిజులా ప్రపంచంలో అతిపెద్ద నిరూపిత చమురు నిల్వలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మదురో తొలగింపు తర్వాత, అమెరికా వెనిజులా చమురు ఉత్పత్తి, అమ్మకాలను నియంత్రించడానికి ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరిపింది.
అంతేకాక వాషింగ్టన్ కొన్ని ఆంక్షలను ఎత్తివేసి.. వెనిజులాకు ముడి చమురు వ్యాపారం చేయడానికి లైసెన్సులను ఆమోదించింది. ఈ చర్య అమెరికా ఆర్థిక, రక్షణ, ఎనర్జీ వ్యూహాలపై వ్యూహాత్మక ప్రవేశాన్ని చూపుతోంది. బర్గమ్ వివరించినట్లుగా ఈ బంగారం అమెరికా పరిశ్రమలకు, చమురు, మైనింగ్ మరియు ఖనిజ వనరులలో సమర్థవంతమైన ప్రావీణ్యాన్ని అందిస్తుందని తెలుస్తోంది.
ఈ 100 మిలియన్ డాలర్ల Gold వనరు అమెరికాకు రావడం.. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా స్థానంను మరింత బలపరుస్తుంది. వనరుల వ్యూహాత్మక ప్రాప్యత, స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడులకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. వాణిజ్య, రక్షణ, AI ఆయుధ రంగాల్లో దీని ప్రాముఖ్యత పెద్దదిగా నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications