కరోనా మహమ్మారి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కేవలం ఏప్రిల్ నెలలోనే 20.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి పెరిగింది. ప్రభుత్వం 1939 నుండి నిరుద్యోగ డేటాను ట్రాక్ చేస్తోంది. అప్పటి నుండి కేవలం ఒకే నెలలో ఇంతపెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం ఈసారే కావడం గమనార్హం. 2008లో కూడా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఈ పదేళ్లలో 22.8 మిలియన్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి ఉద్యోగాలు పోతున్నాయి.

H1B వీసాలపై నిషేధం
మార్చి నెలలో 8.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఏప్రిల్ నెలలో రెట్టింపుకు మించి రికార్డ్ స్థాయిలో 20.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కోట్లాది మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. సొంత దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో అమెరికా H1B వంటి వర్క్ వీసాలను తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రూపొందించే పనిలో ఉన్నారు. H1B అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.

H1B, H2B వీసాలు
H1B వీసాతో అమెరికాలో 5 లక్షలమంది వరకు పని చేస్తున్నారు. కొన్ని తాత్కాలిక, వర్క్ బేస్డ్ వీసాలపై నిషేధం విధించే దిశగా ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్ వర్క్ చేస్తున్నారని, ఇందులో H1B, H2B ఉంటాయని చెబుతున్నారు. ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకు దక్కాలనే ఉద్దేశంతో H1B వర్కింగ్ వీసాలతో పాటు చదువుకునేందుకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం కల్పించే H2Bలపై కూడా తాత్కాలిక నిషేధం విధించనున్నారని తెలుస్తోంది. చాలామంది విద్యార్థులు అక్కడ ఖర్చులకు అనుగుణంగా ఏదో ఉద్యోగం చేస్తూ చదువుకుంటారు. దీనిపై కూడా కఠిన నిర్ణయం తీసుకోనున్నారు.

మనపైనే ఎక్కువ ప్రభావం
కరోనా కారణంగా రెండో క్వార్టర్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థపై 15 శాతం నుండి 20 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగాలు పోతున్న సమయంలో అమెరికా H1B, H2B వీసాలపై కఠిన నిర్ణయం తీసుకుంటోందంటున్నారు. H1B, H2B వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తే ఎక్కువగా భారతీయులపై ప్రభావం పడనుంది. ఈ వీసాలపై ఎక్కువగా ఉద్యోగాలు చేసేది మనవారే.

మనవారికి ఇబ్బంది
కొన్ని కంపెనీలు మన దేశం నుండి ప్రొఫెషనల్ ఎక్స్‌ఫర్ట్స్‌ను H1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగం కల్పిస్తాయి. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున అమెరికాకు వెళ్తుంటారు. అమెరికన్లతో పోలిస్తే మన వారికి వేతనాలు తక్కువ. కాబట్టి అక్కడి కంపెనీలు మనవాళ్లకే ప్రాధాన్యత ఇస్తాయి. అమెరికాలో చదివే విద్యార్థుల్లోను మన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాత్కాలికంగా వీసాలపై నిషేధం విధిస్తే అమెరికాలో చదువుకునే వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications