For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ మాత్రమే కాదు.. చైనాకు బిడెన్ భారీ షాక్: 7 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో..

|

అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనాకు కొరకురాని కొయ్యలా తయారయ్యారు. ఆయన వైట్ హౌస్‌ను వీడి వెళ్తుంటే చైనా సంబరపడింది. జోబిడెన్ గెలుపు కోసం ఎంతో ఎదురు చూసింది. డ్రాగన్ కంట్రీ కల నెరవేరీ, ఆయన గెలిచారు. బైడెన్ గెలుపుతో అమెరికాతో ఉన్న ట్రేడ్ వార్‌కు ముగింపు ఉంటుందని భావించింది. కానీ అలా జరగడం లేదు. ఫైనాన్షియల్ కంపెనీలపై ట్రంప్ కంటే బిడెన్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బిడెన్ ప్రభుత్వం చైనాకు చెందిన కంప్యూటర్ మేకర్స్, రీసెర్చ్ ల్యాబ్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది.

ఏడు కంపెనీలు బ్లాక్ లిస్టులో

ఏడు కంపెనీలు బ్లాక్ లిస్టులో

జోబిడెన్ కార్యవర్గం మరో 7 సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. చైనా సైన్యానికి ఆ సంస్థలు సాయం చేయడమే కారణమని పేర్కొంది. చైనా సంస్థలు అమెరికా టెక్నాలజీ పొందకుండా బిడెన్ ఆంక్షలు విధించడం ఇది మొదటిసారి. వీటిలో మూడు సంస్థలతోపాటు నాలుగు చైనా నేషనల్ కంప్యూటర్ సెంటర్‌కు చెందిన మూడు బ్రాంచీలు ఉన్నాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో ఆయా సంస్థలకు అమెరికా నుండి ఎలాంటి సాంకేతికత వెళ్లాలన్నా కఠిన అనుమతుల ప్రక్రియ ఉంటుంది.

అమెరికా మాట ఇదీ

అమెరికా మాట ఇదీ

ఆ సంస్థలు చైనా సైన్యం సామూహిక విధ్వంస ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూపర్ కంప్యూటర్లను సమకూరుస్తున్నాయని అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ తెలిపింది. అమెరికా టెక్నాలజీ ద్వారా తమ సైన్యాన్ని ఆధునీకరించాలన్న చైనా ఎత్తుగడలను ఫలించనీయమని అమెరికా ప్రతినిధులు తెలిపారు. బిడెన్ తాజా నిర్ణయంతో అమెరికా టెక్నాలజీ పొందేందుకు లైసెన్స్ తీసుకోవాలి.

ఇదీ సూపర్ కంప్యూటర్

ఇదీ సూపర్ కంప్యూటర్

ఏడు చైనా సూపర్ కంప్యూటర్ గ్రూప్‌లకు అమెరికా షాకిచ్చిన నేపథ్యంలో ఈ సూపర్ కంప్యూటర్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే సూపర్ కంప్యూటర్ వేల రెట్లు శక్తివంతమైనది. అతి తక్కువ సమయంలో లెక్కలను పరిష్కరించగలదు. వాతావరణ పరిశోధనలకు, అణు పరీక్షల నకళ్లకు కృత్రిమంగా కంప్యూటర్లలో సృష్టించడం, ఔషధాల పరిశోధనలకు ఉపయోగిస్తారు.

English summary

ట్రంప్ మాత్రమే కాదు.. చైనాకు బిడెన్ భారీ షాక్: 7 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో.. | US adds seven Chinese computer makers, research labs to export blacklist

The Biden administration has added seven Chinese supercomputer research labs and manufacturers to a US export blacklist in a spreading conflict with Beijing over technology and security.
Story first published: Friday, April 9, 2021, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X