For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

H1B వీసాదారులకు దిగ్గజ కంపెనీలు ఇచ్చే వేతనం తక్కువే! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా కంపెనీల్లో ఇలా..

|

ఫేస్‌బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలు సహా దాదాపు అన్ని సంస్థలు కూడా H1B వీసాదారులకు సాధారణ మార్కెట్ వేతనాలతో పోలిస్తే తక్కువ చెల్లిస్తున్నట్లుగా ఓ సర్వే వెల్లడించింది. H1B వీసాస్ అండ్ అండ్ ప్రివెయిలింగ్ వేజ్ లెవల్స్ పేరిట ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను విడుదల చేసింది.

ఉద్యోగులకు షాక్.. శాలరీ బడ్జెట్‌లో మార్పు లేదు, నో ప్రమోషన్స్: సర్వేలో ఆసక్తికర అంశాలుఉద్యోగులకు షాక్.. శాలరీ బడ్జెట్‌లో మార్పు లేదు, నో ప్రమోషన్స్: సర్వేలో ఆసక్తికర అంశాలు

దిగ్గజ కంపెనీలు సహా అందరు ఇదే దారిలో..

దిగ్గజ కంపెనీలు సహా అందరు ఇదే దారిలో..

H1B వీసాదారులు ఉన్న టాప్ 30 కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, గూగుల్, ఉబెర్, ఆపిల్, ఫేస్‌బుక్ సహా ప్రధాన అమెరికా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు అన్ని కూడా H1B వర్కర్స్‌లలో చాలామందికి స్థానిక మధ్యస్థ వేతనం కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తోంది. ఇందుకు సంస్థలు ప్రోగ్రామ్ రూల్స్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాయి. అంటే డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్ H1B నిబంధనలు సైతం ఇందుకు అనుమతిస్తున్నాయి.

అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా

అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా

H1B వీసాదారులకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే తొలి 30 కంపెనీలలో సగానికి పైగా ఉద్యోగుల ఎంపికలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక కంపెనీలు మాత్రం రిక్రూట్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. వేతనాల్లో మాత్రం లెవల్ 1, లెవల్ 2 విధానాలను అవలంభిస్తున్నాయని సర్వే వెల్లడించింది. అమెరికా కార్మిక శాఖ ధృవీకరించిన H1B వీసాల్లో 60 శాతం మంది తక్కువ పొందుతున్నారు.

లెవల్ 3 వేతనం 18 శాతం మందికే

లెవల్ 3 వేతనం 18 శాతం మందికే

H1B ప్రోగ్రామ్ రూల్స్‌ను మార్చేందుకు అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్‌కు అనుమతి ఉంది. కానీ దానిని మార్చడం లేదు. 2019 ఏడాదిలో 53,000 మంది యజమానులు H1B ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకున్నారు. ప్రముఖ సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎంపిక చేసుకున్నన ఉద్యోగుల్లో 35 శాతం మందికి లెవల్ 1, 42 శాతం మందికి లెవల్ 2 వేతనాలు ఆఫర్ చేసినట్లు సర్వే తెలిపింది. ఈ రెండు కూడా మధ్యస్థ వేతనం కంటే తక్కువ. అక్కడి స్థానిక మధ్యస్థ వేతనంతో సమానంగా ఉండే లెవల్ 3 వేతనం కేవలం 18 శాతం మందికి మాత్రమే ఇచ్చింది. ఇక లెవల్ 4 వేతనం కేవలం 3 శాతం మందికి ఉంది.

ప్రతి 8 మందిలో ఒకరు మాత్రమే

ప్రతి 8 మందిలో ఒకరు మాత్రమే

అమెజాన్ డాట్ కామ్ విషయానికి వస్తే H1B 34 శాతం మంది లెవల్ 1, 51 శాతం మంది లెవల్ 2 ఉన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ 47 శాతం మందికి లెవల్ 1, 36 శాతం మందికి లెవల్ 2 వేతనాలు చెల్లిస్తోంది. లెవల్ 1, లెవల్ 2లలో మొత్తం 12,428 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 85 శాతం మంది వరకు మధ్యస్థ వేతనం కంటే తక్కువ అందుతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మాత్రమే లెవల్ 3, లెవల్ 4 వేతనాలు అందుకుంటున్నారు.

వివిధ కంపెనీల్లో..

వివిధ కంపెనీల్లో..

ఆపిల్ H1B వీసాదారుల్లో లెవల్ 1, లెవల్ 2లలో వరుసగా 2 శాతం, 34 శాతం, లెవల్ 3 కింద 32 శాతం, లెవల్ 4 కింద 34 శాతం ఉన్నారు. గూగుల్‌లో లెవల్ 1, లెవల్ 2లో 55 శాతం వరకు, 37 శాతం వరకు మాత్రమే మీడియం లెవల్ కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో లెవల్ 1 ఒక శాతం, లెవల్ 2లో 10 శాతం ఉన్నారు. ఇలా ఉబెర్ తదితర కంపెనీల్లో లెవల్ 1, లెవల్ 2 వేతనాలు చాలామందికి ఇస్తున్నారు.

English summary

H1B వీసాదారులకు దిగ్గజ కంపెనీలు ఇచ్చే వేతనం తక్కువే! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా కంపెనీల్లో ఇలా.. | Many H1B employers use programme to pay migrants salary below median wage

A majority of H-1B employers, including major American technology firms like Facebook, Google, Apple and Microsoft, use the programme to pay migrant workers well below market wages, according to a new report.
Story first published: Wednesday, May 6, 2020, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X