For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, పుంజుకున్న నియామకాలు: ఈ రంగాల్లో గతంలో కంటే జంప్

|

ఢిల్లీ: కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్ వేగంగా రికవరీ అవుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. దేశంలో ఉపాధి మార్కెట్ పుంజుకుందని, ప్రధానంగా ఐటీ, వ్యవసాయ ఆధారిత రంగాలు సహా కొన్ని రంగాలు కరోనా ముందుస్థాయి కంటే ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపింది. గత జనవరి కంటే కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగ ప్రకటనలు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్టువేర్ రంగాల్లో ఉద్యోగ ప్రకటనలు క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? వడ్డీ, ఇతర ఆదాయాలపై టీడీఎస్ భారం

జాబ్ మార్కెట్ మెరుగు కానీ

జాబ్ మార్కెట్ మెరుగు కానీ

డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి నెలలో హైరింగ్ యాక్టివిటీ పెరిగినట్లు తెలిపింది. హైరింగ్ సూచీ నవంబర్ 2020 నెల నుండి స్థిరంగా ఉంది. డిసెంబర్‌తో దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, ఏడాది ప్రాతిపదికన మాత్రం 18 శాతం క్షీణించాయి. 2020, 2021 జనవరి నెల ఉద్యోగ ప్రకటనల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గత జనవరి కంటే కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగ ప్రకటనలు పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. మొత్తం ఐటీ ప్రకటనలలో 6% శాతం ఐటీ నుండి ఉండగా, ఇందులో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుండి అధికంగా వెలువడ్డాయి.

ఈ రంగాలు సూపర్

ఈ రంగాలు సూపర్

ఐటీ సహా వివిధ రంగాల్లో గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ జనవరిలో వృద్ధి కనబరిచాయి. 2020 జనవరితో ఆగ్రో ఇండస్ట్రీలో 15 శాతం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ 2 శాతం ఈ జనవరిలో పెరిగాయి. పరిస్థితులు మరింత మెరుగుపడి ఉపాధి ప్రదేశాలు కూడా పూర్తిస్థాయి కార్యకలాపాలకు సిద్ధమైతే తే రాబోయే నెలల్లో ప్రకటనల జోరు మరింత ఉంటుందని చెబుతున్నారు.

ఏ రంగంలో ఎంత అంటే

ఏ రంగంలో ఎంత అంటే

జాబ్‌ మార్కెట్‌లో ఆకర్షణీయ వాటా కలిగిన ఐటీ పరిశ్రమలోని హార్డువేర్, సాఫ్టువేర్ సంస్థల్లో 2020 జనవరి కంటే ఈ జనవరిలో ఉద్యోగావకాశాలు 6 శాతం ఎగిశాయి. గృహోపకరణాల పరిశ్రమలోనూ 9 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థల్లో 6 శాతం, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, రంగులు, ఎరువులు, క్రిమిసంహారకాలు 5 శాతం నియామకాలు పెరిగాయి. అడ్వైర్టెజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్, తయారీ, ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఉక్కు సంస్థల్లో 4 శాతం మేర పెరిగాయి.

English summary

గుడ్‌న్యూస్, పుంజుకున్న నియామకాలు: ఈ రంగాల్లో గతంలో కంటే జంప్ | Hiring activity remains stable in January 2021: Monster Employment Index

Hiring activity has remained stable in India in January 2021, as per Monster Employment Index, a job analysis report by Monster.com, a Quess company.
Story first published: Thursday, February 11, 2021, 9:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X