ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అన్నా, కొత్తగా స్టార్టప్ పెట్టాలన్నా మనకి మొదట గుర్తొచ్చే పేర్లు బెంగళూరు(Bengaluru) లేదా హైదరాబాద్(Hyderabad). గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం మౌలిక సదుపాయాల పరంగా, తక్కువ ఆఫీస్ అద్దెల పరంగా బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే, ఎన్ని నగరాలు పోటీకి వస్తున్నా, 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా బెంగళూరు తన ముద్రను ఏమాత్రం కోల్పోవడం లేదు. అసలు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. గ్లోబల్ కంపెనీలు ఇప్పటికీ బెంగళూరు వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

నెట్‌వర్క్ ఎఫెక్ట్: బెంగళూరు అసలైన బలం
హైదరాబాద్‌లో విశాలమైన రోడ్లు, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మాట వాస్తవమే. కానీ, బెంగళూరులో ఉన్న 'ఎకోసిస్టమ్' మరెక్కడా దొరకదు. ఇక్కడ కేవలం ఐటీ కంపెనీలే కాదు, వేల సంఖ్యలో స్టార్టప్ లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), వెంచర్ క్యాపిటల్ సంస్థలు , పరిశోధనా కేంద్రాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పూరి గారు చెప్పినట్లు, విదేశీ కంపెనీలు భారతదేశంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు మొదట బెంగళూరునే బెంచ్‌మార్క్‌గా తీసుకుంటాయి. ఇక్కడి అకడమిక్ నెట్‌వర్క్ , ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్స్ ప్రపంచంలోని అతికొద్ది నగరాలకు మాత్రమే సాధ్యం.
ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందంటే?
గణాంకాలను గమనిస్తే బెంగళూరు హవా స్పష్టంగా కనిపిస్తుంది. CBRE నివేదిక ప్రకారం.. 2026 నాటికి బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 12.1 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికం. షాంఘై వంటి మెగా సిటీల కంటే బెంగళూరు ముందుండటం విశేషం. 2025 డేటా ప్రకారం హైదరాబాద్‌లో ఆఫీస్ అబ్జార్ప్షన్ 8.5 మిలియన్ చదరపు అడుగులు ఉంటే, బెంగళూరులో అది ఏకంగా 15 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
రెంట్ తక్కువైనా హైదరాబాద్ ఎందుకు వెనుకబడి ఉంది?
హైదరాబాద్‌లో గ్రేడ్-A ఆఫీస్ అద్దెలు బెంగళూరు కంటే సుమారు 31 శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా కంపెనీలకు మంచి రాయితీలు ఇస్తోంది. అందుకే పెద్ద తరహా కార్యకలాపాలు, బ్యాక్ ఆఫీస్ పనుల కోసం కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. కానీ, డీప్ టెక్నాలజీ, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ , స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వంటి కీలక విభాగాల విషయానికి వస్తే బెంగళూరులోని టాలెంట్ పూల్‌కు సాటిలేదు. అందుకే కంపెనీలు బెంగళూరును హెడ్ క్వార్టర్స్‌గా ఉంచుకుని, హైదరాబాద్‌ను ఆపరేషన్ హబ్‌గా వాడుకుంటున్నాయి.
మౌలిక సదుపాయాల సమస్యలున్నా తగ్గేదే లే!
ట్రాఫిక్ సమస్యలు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఇబ్బందులు ఉన్నప్పటికీ, కంపెనీలు బెంగళూరును వదలడం లేదు. దీనికి కారణం అక్కడ దొరికే ఇన్నోవేషన్ వాతావరణం. నిసస్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయెంకా అభిప్రాయం ప్రకారం, సమీప భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరును అధిగమించడం కష్టమే. ఎందుకంటే చాలా ఐటీ దిగ్గజాలు తమ ప్రధాన పెట్టుబడులను బెంగళూరుతో పాటు ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయే తప్ప, హైదరాబాద్‌ను మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా చూడటం లేదు.
మొత్తానికి చెప్పాలంటే హైదరాబాద్ వేగంగా ఎదుగుతున్న నగరం అనడంలో సందేహం లేదు. కానీ దశాబ్దాల కాలంగా బెంగళూరు నిర్మించుకున్న ఆ పటిష్టమైన వ్యాపార నెట్‌వర్క్ , నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఆ నగరాన్ని ఇప్పటికీ ఐటీ రంగంలో నంబర్ వన్‌గా నిలబెడుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..



Click it and Unblock the Notifications