ఒకప్పుడు ఐటీ అంటే కేవలం బెంగళూరు (Bengaluru) మాత్రమే గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) ఏర్పాటులో హైదరాబాద్ నగరం బెంగళూరుకు గట్టి పోటీనివ్వడమే కాకుండా కొన్ని విషయాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఇప్పుడు హైదరాబాద్‌ను మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఇటీవలి డేటా ప్రకారం, 2025లో భారతదేశంలో మొత్తం 85 కొత్త గ్రీన్ ఫీల్డ్ GCCలు ప్రారంభం కాగా.. అందులో 35 (41%) ఒక్క హైదరాబాద్‌లోనే వెలిశాయి. ఇదే సమయంలో బెంగళూరులో కేవలం 21 (25%) మాత్రమే వచ్చాయి. అంటే కొత్తగా వచ్చే కంపెనీలు బెంగళూరు కంటే హైదరాబాద్‌కే మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలోని మొత్తం GCC యూనిట్లలో ఐదో వంతు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
సామాన్యుల జీవితాల్లో మార్పు
హైదరాబాద్ ఎదుగుదల కేవలం నగరానికే పరిమితం కాలేదు. వేల మంది యువత జీవితాలను మారుస్తోంది. గుంటూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య కుటుంబాల బిడ్డలు నేడు హైదరాబాద్‌లోని జేపీ మోర్గాన్, ఒరాకిల్, ఏఎమ్‌డీ (AMD) వంటి దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. "మా నాన్న మిర్చి మార్కెట్‌లో కూలీ. కానీ, ఇప్పుడు నేను, మా చెల్లి ఇద్దరం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని గొప్ప కంపెనీల్లో పనిచేస్తున్నాం" అని ఒక ఉద్యోగి గర్వంగా చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఒక కొత్త వ్యక్తిత్వాన్ని ఇస్తోందని యువత అభిప్రాయపడుతోంది.
హైదరాబాద్ ఎందుకు నచ్చుతోంది?
బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు (Infrastructure) చాలా మెరుగ్గా ఉండటం ఒక ప్రధాన కారణం. ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ.. రోడ్లు, మెట్రో సౌకర్యాలు కొత్త కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు..
- ఇక్కడ స్థానిక భాషతో సంబంధం లేకుండా ఎవరైనా సులభంగా కలిసిపోవచ్చు.
- ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, నాణ్యత ఎక్కువ.
- ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జిసిసి పాలసీ, టీ-హబ్ (T-Hub), జెనోమ్ వ్యాలీ వంటి క్లస్టర్లు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
బెంగళూరు సవాళ్లు
మరోవైపు బెంగళూరు (Bengaluru) లో పెరుగుతున్న ట్రాఫిక్, మౌలిక సదుపాయాల లోటు , పెరుగుతున్న ఖర్చులు ఆ నగరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా వంటి ప్రముఖులు కూడా బెంగళూరు తన మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోకపోతే పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏదేమైనా హైదరాబాద్ కేవలం ఫార్మా లేదా ఫైనాన్స్ కంపెనీలకే కాకుండా, యానిమేషన్ వంటి విభిన్న రంగాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, గ్లోబల్ స్టైల్‌ను అక్కున చేర్చుకుంటున్న హైదరాబాద్, రాబోయే రోజుల్లో దేశానికే ఐటీ రాజధానిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

Bengaluru: బెంగళూరులో బతకాలంటే ఇంత అవుతుందా? వైరల్ అవుతున్న కపుల్ మంత్లీ బడ్జెట్!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ టాక్సీలు! ఆ ఏరియా వాళ్లకు పండగే!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం.. కర్ణాటకలో పలు జిల్లాలు నీటి కొరతతో విలవిల..

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!



Click it and Unblock the Notifications